Andhra King Taluka Day 3 Collections: ఆంధ్రా కింగ్‌ తాలూకా కలెక్షన్స్.. మూడు రోజుల్లో రామ్ ఎంత రాబట్టాడంటే?

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 650 స్క్రీన్‌లలో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లలో 1300 స్క్రీన్లు చొప్పున 1950 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Andhra King Taluka Day 3 Expected Box Office Collections Worldwide Ram Pothineni s Movie witness a good surge

ఆంధ్రా కింగ్ తాలూకా రెండు రోజుల కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున ఇండియా వైడ్‌గా 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు చొప్పున రెండు రోజుల్లో 7.25 కోట్ల రూపాయల నెట్... 8.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు కర్ణాటకలో 85 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 7.4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 13 లక్షల రూపాయలు చొప్పున వసూలైంది. తెలుగు రాష్ట్రాలలో తొలిరోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే రామ్ పోతినేని చిత్రం నైజాంలో 2.45 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 41 లక్షల రూపాయలు ఆంధ్రాలో 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆంధ్రా కింగ్ తాలూకా ఓవర్సీస్ కలెక్షన్స్
ఆంధ్రా తాలూకా సినిమాకు ఓవర్సీస్‌ కలెక్షన్స్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో ఒక్క ప్రీమియర్స్ ద్వారా 123K డాలర్లు (భారత కరెన్సీలో 1.09 కోట్ల రూపాయలు) వచ్చాయి. ప్రీమియర్స్‌+ తొలి రోజు కలెక్షన్స్ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి 268K (భారత కరెన్సీలో 2.40 కోట్ల రూపాయలు) వచ్చింది. రెండో రోజు సాయంత్రం 7 గంటల వరకు నార్త్ అమెరికాలో రామ్ పోతినేని సినిమాకు 60K (53.60 లక్షల రూపాయలు) వచ్చింది. దీని ప్రకారం రెండు రోజుల్లో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు ఒక్క నార్త్ అమెరికాలోనే 330K (భారత కరెన్సీలో 2.95 కోట్ల రూపాయలు) వచ్చింది. ఇక మిగిలిన దేశాల నుంచి 30 లక్షల రూపాయలు రాబట్టింది ఈ చిత్రం. మొత్తంగా ఓవర్సీస్ నుంచి ఆంధ్రా కింగ్ తాలూకా 3.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రామ్ పోతినేని సినిమా రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 11.75 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఆంధ్రా కింగ్ తాలూకా మూడో రోజు కలెక్షన్స్
పాజిటివ్ టాక్‌తో రామ్ పోతినేని సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి 21 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. మూడో రోజు రామ్ పోతినేని మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X