Andhra King Taluka Day 4 Collections: ఆంధ్రా కింగ్ వసూళ్ల జాతర... నాలుగో రోజు రామ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో రామ్ పోతినేనికి ఆంధ్రా కింగ్ తాలుకా చిత్రం కాస్తంత ఊరట కలిగించింది. నవంబర్ 27వ తేదీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లతో పరుగులు తీస్తోంది. గడిచిన మూడు రోజుల్లో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాన్ని నిర్మించారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. వివేక్- మెర్విన్‌లు స్వరాలు సమకూర్చారు.

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 650 స్క్రీన్‌లలో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లలో 1300 స్క్రీన్లు చొప్పున 1950 స్క్రీన్‌లలో విడుదల చేశారు.
ఆంధ్రా కింగ్ తాలూకా మూడు రోజుల కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున ఇండియా వైడ్‌గా 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.5 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 10.75 కోట్ల రూపాయల నెట్.. 12.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో తొలి రోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే రామ్ పోతినేని చిత్రం ఇప్పటి వరకు నైజాంలో 3.70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 52 లక్షల రూపాయలు ఆంధ్రాలో 2.72 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకా ఓవర్సీస్ కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 4,11,145 డాలర్లు (భారత కరెన్సీలో 3.67 కోట్ల రూపాయలు) వచ్చింది. ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి 40 లక్షల రూపాయలు వచ్చింది. దాంతో ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు మొత్తంగా 4 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు మూడు రోజుల్లో 17 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయలు, కర్ణాటకలో కోటి 20 లక్షల రూపాయలు, తమిళనాడులో 30 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకా నాలుగో రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో రామ్ పోతినేని సినిమాకు సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆదివారం తెలుగు వెర్షన్‌లో సాయంత్రం 4 గంటల వరకు 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. నాలుగో రోజు రామ్ పోతినేని మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రామ్ పోతినేని సినిమా 20 కోట్ల రూపాయలు మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











