Andhra King Taluka Day 5 Collections: షాకింగ్‌గా ఆంధ్రా కింగ్‌ వసూళ్లు.. రామ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే జంటగా మహేశ్ పాచిగోళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. నవంబర్ 27వ తేదీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. వివేక్- మెర్విన్‌లు స్వరాలు సమకూర్చారు. వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా సోమవారం గండం గట్టెక్కిందా లేదా? ఇప్పటి వరకు ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 650 స్క్రీన్‌లలో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లలో 1300 స్క్రీన్లు చొప్పున 1950 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Andhra King Taluka Day 5 Expected Box Office Collections Worldwide Ram Pothineni s Movie In Trouble for reaching target

ఆంధ్రా కింగ్ తాలూకా నాలుగు రోజుల కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున ఇండియా వైడ్‌గా 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.7 కోట్ల రూపాయలు చొప్పున నాలుగు రోజుల్లో 14.6 కోట్ల రూపాయల నెట్.. 17.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో తొలి రోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.63 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.68 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే రామ్ పోతినేని చిత్రం ఇప్పటి వరకు నైజాంలో 4.60 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 62 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 3.82 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆంధ్రా కింగ్ తాలూకా ఓవర్సీస్ కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 450K డాలర్లు (భారత కరెన్సీలో 4.02 కోట్ల రూపాయలు) వచ్చింది. ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి 40 లక్షల రూపాయలు వచ్చింది. దాంతో ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు మొత్తంగా 4.40 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు నాలుగు రోజుల్లో 21.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 14.8 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.73 కోట్ల రూపాయలు, తమిళనాడులో 35 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 35 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 4.40 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

ఆంధ్రా కింగ్ తాలూకా ఐదో రోజు కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ వీకెండ్‌లో ఎదురు లేకుండా సాగినప్పటికీ.. మండే టెస్ట్‌లో ఫెయిలైనట్లే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం, వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ పడిపోయాయి. ఫస్ట్ షో, సెకండ్ షో బుకింగ్స్ పైనే 5వ రోజు వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. 5వ రోజు సాయంత్రం 6 గంటల వరకు తెలుగులో 15 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో ఐదో రోజు రామ్ పోతినేని సినిమాకు వరల్డ్ వైడ్‌గా 2.50 కోట్ల రూపాయల వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దాంతో ఐదు రోజుల వరకు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ వరల్డ్ వైడ్‌గా 24 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.

రామ్ పోతినేని సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 18 కోట్ల రూపాయల షేర్... 26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ వారం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సహా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో రామ్ పోతినేని ఎంత వరకు నిలబడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X