Andhra King Taluka Day 6 Collections: పడిపోయిన ఆంధ్రా కింగ్ వసూళ్లు... రామ్ మూవీకి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటించారు. కన్నడ అగ్రనటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. మహేశ్ పాచిగోళ్ల దర్శకత్వం వహించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. వివేక్- మెర్విన్‌లు స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? ఈ వివరాల్లోకి వెళితే..
ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 650 స్క్రీన్‌లలో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లలో 1300 స్క్రీన్లు చొప్పున 1950 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ఆంధ్రా కింగ్ తాలూకా 5 రోజుల కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.35 కోట్ల రూపాయలు చొప్పున ఐదు రోజుల్లో ఇండియా వైడ్‌గా 15.95 కోట్ల రూపాయల నెట్.. 18.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో తొలి రోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.63 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.68 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.35 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో ఏరియాలవారీగా ఆంధ్రా కింగ్ తాలూకా వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 4.82 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 68 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 4.28 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకా ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రామ్ పోతినేని సినిమాకు ఐదు రోజుల్లో 23.1 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.85 కోట్ల రూపాయలు, తమిళనాడులో 40 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకా 6వ రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు మంచి వసూళ్లు రాబట్టిన ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం.. సోమవారం నుంచి బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. దాంతో బుకింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. 6వ రోజు సాయంత్రం 4 గంటల వరకు రామ్ పోతినేని సినిమాకు తెలుగులో 13 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. దాంతో ఆరో రోజున ఆంధ్రా కింగ్ తాలుకాకు వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. దీంతో కలిపి కలిపి ఆరు రోజుల వరకు రామ్ పోతినేని సినిమా 25 కోట్ల రూపాయల మార్క్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిజాస్టర్ దిశగా ఆంధ్రా కింగ్ తాలూకా
మరోవైపు.. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 16 కోట్ల రూపాయల షేర్... 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తోన్న కలెక్షన్స్, ప్రేక్షకుల ఆదరణను బట్టి చూస్తే ఆంధ్రా కింగ్ తాలూకా నిలబడటం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 రిలీజ్ కానుంది. దాంతో రామ్ పోతినేని సినిమా థియేటర్లు కోల్పోనుంది. మరి లాంగ్ రన్‌లో ఆంధ్రా కింగ్ తాలూకా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











