Andhra King Taluka Day 7 Collections: ఆంధ్రా కింగ్ వసూళ్లపై దెబ్బ... నష్టాల్లో రామ్ మూవీ, ఎన్ని కోట్లంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మహేశ్ పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. వివేక్- మెర్విన్‌లు స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 7వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? ఈ వివరాల్లోకి వెళితే..
ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, పబ్లిసిటీ, ఇతర ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ఆంధ్రా కింగ్ తాలూకా 6 రోజుల కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తొలి రోజున 4.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.65 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.05 కోట్ల రూపాయలు చొప్పున ఆరు రోజుల్లో ఇండియా వైడ్‌గా 16.95 కోట్ల రూపాయల నెట్.. 19.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. తెలుగు రాష్ట్రాలలో తొలి రోజున 4.13 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.06 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.63 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.68 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.29 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.04 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారీగా ఆంధ్రా కింగ్ తాలూకా వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 4.96 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 75 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 4.56 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
రామ్ పోతినేని సినిమాకు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. నార్త్ అమెరికాలో సోమవారం నాడు కేవలం 12K డాలర్లు (10.82 లక్షల రూపాయలు) వసూలు చేయగా.. దాంతో కలిపి ఇప్పటి వరకు ఇక్కడ ఈ సినిమా 460K (4.14 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన దేశాలలో మరో 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి ఓవర్సీస్ నుంచి 4.65 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రామ్ పోతినేని మూవీ 6 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 24.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 17.21 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.93 కోట్ల రూపాయలు, తమిళనాడులో 44 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 42 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకా 7వ రోజు కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా కలెక్షన్స్ సోమవారం నుంచి వరుసగా మూడో రోజు కూడా పడిపోయాయి. 7వ రోజైన బుధవారం రాత్రి 8 గంటల వరకు రామ్ పోతినేని సినిమాకు తెలుగులో 12 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఈరోజు కడపటి వార్తలు అందేసరికి ఈ సినిమా ఇండియాలో 44 లక్షల రూపాయల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్‌ను బట్టి ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం 7వ రోజు వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలు మాత్రమే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 7 రోజుల వరకు రామ్ పోతినేని చిత్రం వరల్డ్ వైడ్‌గా 26 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 15 కోట్ల రూపాయల షేర్.. 34 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. మరికొద్దిగంటల్లో అఖండ 2 థియేటర్‌లలో దిగుతుండటంతో రామ్ పోతినేని- భాగ్యశ్రీల చిత్రం కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అఖండ 2 ప్రదర్శనను బట్టే ఆంధ్రా కింగ్ తాలూకా భవితవ్యం ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











