Andhra King Taluka Box Office: అడ్వాన్స్ బుకింగ్‌లో ఆంధ్రా కింగ్ హవా... రామ్ పోతినేని మూవీకి ఎన్ని కోట్లంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత చేసిన రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. భారీ స్టాయిలో ప్రచారం చేయడంతో పాటు టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈసారి రామ్ పోతినేని హిట్ కొడతారని ఆయన అభిమానులు ధీమాగా చెబుతున్నారు. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం దూకుడు చూపిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే...
నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా
ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను 70 కోట్ల రూపాయలతో నిర్మించారు. టీజర్, ట్రైలర్లు, పాటలతో పాటు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలతో మంచి హైప్ క్రియేటైంది. దాంతో రామ్ పోతినేని సినిమా బిజినెస్ కూడా క్రేజీగానే జరిగింది అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు వరల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రా కింగ్ తాలూకా బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. రామ్ గత చిత్రాలు డిజాస్టర్ కావడంతో పెద్దగా బిజినెస్ జరగకపోవడం కూడా ప్లస్ పాయింటే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆంధ్రా కింగ్ తాలూకా అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా కలెక్షన్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో రామ్ మూవీ దూసుకెళ్తోంది. రిలీజ్‌కు ఒక రోజు ముందే నార్త్ అమెరికాలో అంటే నవంబర్ 26వ తేదీన ప్రీమియర్స్ పడనున్నాయి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ హవా చూపిస్తోంది. నవంబర్ 24వ తేదీ వరకు అందుతున్న లెక్కల ప్రకారం.. ఒక్క అమెరికాలోనే 94 సెంటర్‌లలో, 162 షోలకు గాను 2155 టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం అడ్వాన్స్ సేల్స్‌లో ఇప్పటి వరకు 29,863 డాలర్లు (భారత కరెన్సీలో 26.62 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ప్రీమియర్స్‌కు మరో రెండు రోజులు సమయం ఉండటంతో ఆంధ్రా కింగ్ తాలూకా మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











