twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో థియేటర్లపై మరిన్ని ఆంక్షలు.. బంగార్రాజు పరిస్థితి ఏమిటి?

    |

    ఒకవైపు కరుణ కేసులు పెరుగుతుండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలకు తెలుగు చిత్ర పరిశ్రమ బిజినెస్ చాలా వరకు తగ్గిపోయింది అనే చెప్పాలి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా అలాగే శ్యామ్ సింగరాయ్ రెండు కూడా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు టికెట్ల రేట్లు తక్కువగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి.. ఇక ఇప్పుడు జనవరి 14న రాబోయే బంగార్రాజు సినిమాకు మరొక పరీక్ష ఎదుర్కోబోతున్న ట్లు తెలుస్తోంది.

    ఎన్ని చర్చలు జరిగినా..

    ఎన్ని చర్చలు జరిగినా..

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్యలో గత కొంతకాలంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎన్ని చర్చలు జరిగిన మరెన్ని వాదోపవాదాలు జరిగిన కూడా అవి ఏమాత్రం సఫలం కావడం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా ఈ విషయంపై బలంగా వారి గొంతును వినిపించలేకపోతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ నాని మాత్రమే ధైర్యం చేసి మాట్లాడారు.

    బంగార్రాజుపై ప్రభావం?

    బంగార్రాజుపై ప్రభావం?

    ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఊహించని విధంగా అనేక రకాల ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని, టికెట్ల రేట్లు మరి ఎక్కువగా ఉన్నాయి అనే కారణంచేత తగ్గిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కఠిన చర్యలతో రాబోయే బంగార్రాజు సినిమాపై కూడా మరింత ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

     పరవాలేదన్న నాగార్జున

    పరవాలేదన్న నాగార్జున

    ఇటీవల నాగార్జున బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టిక్కెట్ల రేట్లపై విషయంపై చాలా పాజిటివ్ గా స్పందించడం విశేషం. మా సినిమాకు టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నా పర్వాలేదు అని చాలా క్లియర్ గా వివరణ ఇచ్చాడు. ఈ వివరణ పై సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోలింగ్స్ వెలువడిన విషయం తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా మంది అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

     శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ

    శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ

    ఇక నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత కఠిన అంశాలు తీసుకోవడంతో బంగార్రాజు సినిమా ఇలాంటి బిజినెస్ చేస్తుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు గా అధికారులు ప్రకటన ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందట.

    50 ఆక్యుపెన్సీలోనే..

    50 ఆక్యుపెన్సీలోనే..

    రాత్రి 10 గంటల నుంచే కర్ఫ్యూ అంటే ఒక షో తగ్గినట్లే అని చెప్పవచ్చు. దియేటర్స్ చాలా వరకు 50% ఆక్యుపెన్సీ తోనే కొనసాగాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కేవలం థియేటర్స్ లోనే కాకుండా రెస్టారెంట్లో అలాగే గవర్నమెంట్ ఆఫీస్ లోలో బార్లలో కూడా 50% ఆక్యుపెన్స్ జన సాంద్రత తోనే ఉండాలి అని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా సింగిల్ స్క్రీన్స్ లలో ఎలా కొనసాగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

    Recommended Video

    Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
    డైరెక్టర్.. మంత్రి సోదరుడే..

    డైరెక్టర్.. మంత్రి సోదరుడే..

    ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగార్రాజు సినిమాను డైరెక్ట్ చేసింది మరెవరో కాదు ఏపీ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఆంక్షలపై బంగార్రాజు టీమ్ అయితే పెద్దగా విభేదించలేదు. మరి ఈ కఠిన ఆంక్షలతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Andhrapradesh night curfew from tomorrow onwards trouble in bangarraju movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X