ఏజెంట్ బడ్జెట్ పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ మూవీగా..

అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సిద్ధమైన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఏజెంట్ మరి కొన్ని రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అనిల్ సుంకర నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

అలాగే అఖిల్ కూడా చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏజెంట్ సినిమా మాత్రం తప్పకుండా అతని కెరీర్ ను సరికొత్త రూట్లోకి తీసుకువస్తుంది అని నమ్ముతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Anil sunkara about Akhil akkineni Agent movie total budget details

ఈ సినిమా బడ్జెట్ మొదట 50 కోట్లు అయింది అని ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాల కోసం రీషుట్ల కారణంగా మరో 20 కోట్లు ఖర్చు చేశారు అనే రూమర్స్ వచ్చాయి. అంతేకాకుండా సినిమాకు బిజినెస్ కూడా సరిగ్గా జరగడం లేదు అని కూడా కథనాలు వెలువడ్డాయి. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన ఆయన ఏజెంట్ సినిమా కోసం అనుకున్న ప్లాన్ ప్రకారమే ఖర్చు అయింది అని మధ్యలో కోవిడ్ రావడం కారణంగా మరొక కొంత ఖర్చయింది అని అన్నారు.

మొత్తంగా అయితే ఏజెంట్ సినిమా కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా చెప్పినా అనిల్ సుంకర ఇప్పటికే కొన్ని ఏరియాలో థియేట్రికల్ హక్కుల డీల్ కూడా ఫినిష్ అయినట్లుగా తెలియజేశారు. అన్ని ఏరియాలలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని తప్పకుండా సినిమా జనాలను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో అఖిల్ నటన అద్భుతంగా ఉంటుంది అని సురేందర్ యాక్షన్ మేకింగ్ కూడా ఊహించని విధంగానే ఉంటుంది అని వివరణ ఇచ్చారు. ఇక ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అఖిల్ అనుకున్నట్లుగానే బిగ్ హిట్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X