Animal 4 days Overseas Collection బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న యానిమల్..అక్కడే 100 కోట్లు కొల్లగొట్టిన రణ్‌బీర్
బాలీవుడ్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో యానిమల్ సినిమా కలెక్షన్ల కుంభవృష్టిని కొనసాగిస్తున్నది. తొలివారాంతంలోనే ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఊహించని కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 4 రోజుల తర్వాత కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యానిమల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రపవచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను 210 కోట్లకుపైగా బిజినెస్ చేశారు. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ రేట్ పలికింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 3.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 30 కోట్ల మేర నమోదైంది.

ఇక యానిమల్ సినిమా 3.8 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలి రోజు 700 లోకేషన్లలో ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా 2.8 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇక రెండో రోజు 2 మిలియన్ డాలర్లు, మూడో రోజు 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం మొత్తంగా 6.5 మిలియన్ డాలర్లు అంటే 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో యానిమల్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అంటే అమెరికాలో, కెనడాలో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. అమెరికాలో 4.1 మిలియన్ డాలర్లు, కెనడాలో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో 6.5 మిలియన్ డాలర్లు రాబట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా రిలీజవ్వడమే కాకుండా బ్రిటన్, యూఏఈ, గల్ఫ్ దేశాల్లో రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా 13.6 మిలియన్ డాలర్లు అంటే.. 113 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ముందుకెళ్లున్నది.

యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీ వెర్షన్ ఇప్పటికే 240 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 420 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. త్వరలోనే 500 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరే అవకాశం కనిపిస్తున్నది.
12.25 Million or Rs 102 Crore gross
Overseas Gross: $13.6M (₹ 113cr)
#Animal #NorthAmerica Gross:
👉Premieres+Day1 : $2,778,867 (700 Locs)
👉Day2 : $1,999,636 (700 Locs)
👉Day3 : $1,685,725 (700 Locs)
👉Day4 : $200,070 (280 Locs) till 9AM EST
[USA : $51,522, CANADA : $148,548]
Total Gross : $6,664,298 [₹55.57 Crs]
USA 🇺🇸: $4,139326
CANADA 🇨🇦: $2,536,455
👉Breakeven: $3.8M [Profits: ₹14Crs+]🔥💥


Click it and Unblock the Notifications











