Animal 4 Weeks Collections 900 కోట్ల కలెక్షన్లు.. హిందీ, తెలుగు, ఓవర్సీస్‌లో లాభం ఎంతంటే?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో యానిమల్ మూవీ ఒకటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇటీవల కాలంలో అత్యధిక రిపీట్ వాల్యూ ఉన్న మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. గత 4 వారాలుగా ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్లను రాబట్టింది. గత నాలుగు వారాల్లో ఈ సినిమా వసూలు చేసినంది ఎంత? బడ్జెట్ ఎంత? ఎంత లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళితే..

టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తృప్తి డిమ్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించిన చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసింది. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు బజ్ ఉండటంతో ఇండియాలో 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Animal 4 Weeks Collections Worldwide: Rashmika Mandanna Movie inching towards 900 Crores Collections

యానిమల్ సినిమా ఓ మోస్తారు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా 210 కోట్ల లక్ష్యంతో కలెక్షన్ల వేట ప్రారంభించింది. రిలీజ్ తర్వాత వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించింది. ట్రేడ్ వర్గాలకే ఊపిరి సలపకుండా ఆశ్చర్యకరమైన కలెక్షన్లను నమోదు చేసింది. రోజు రోజుకు కలెక్షన్లు పంచుకొంటూ వెళ్తూ రికార్డులు క్రియేట్ చేసింది.

యానిమల్ సినిమా ఎవరూ ఊహించని విధంగా తొలివారం కాసుల పంటను పండించింది. హిందీ వెర్షన్ 300 కోట్ల వసూళ్లు సాధించగా, తెలుగు వెర్షన్ 34 కోట్లు, తమిళం 3 కోట్లు, కర్ణాటక 5 కోట్లు, మలయాళం 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 338 కోట్ల రూపాయలను రాబట్టింది.

Animal 4 Weeks Collections Worldwide: Rashmika Mandanna Movie inching towards 900 Crores Collections

యానిమల్ రెండోవారం బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఈ మూవీ జోరుగా కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. 2వ వారంలో హిందీ వెర్షన్ 131 కోట్లు, తెలుగు వెర్షన్ 7.5 కోట్లు, తమిళం 1 కోటికపైగా, కన్నడలో 2.5 కోట్లు, మలయాళంలో 1 కోటి రూపాయల కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ సినిమా 140 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

ఇక యానిమల్ నాలుగో వారం కలెక్షన్ల విషయానికి వస్తే.. హిందీ వెర్షన్ 50 కోట్లకుపైగా, తెలుగు 3.5 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో వారం 55 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక నాలుగో వారం ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Animal 4 Weeks Collections Worldwide: Rashmika Mandanna Movie inching towards 900 Crores Collections

ఇక ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా యానిమల్ 4 వారాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 540 కోట్ల షేర్, 644 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 29 మిలియన్లు అంటే సుమారుగా 240 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 885 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. త్వరలోనే 900 కోట్ల రూపాయల మైలు రాయిని అధిగమించే అవకాశం ఉంది.

యానిమల్ సినిమా లాభ, నష్టాల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ ప్రభంజనం కారణంగా తొలి వారం దాదాపు రిలీజైన అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్‌గా 300 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. నాన్ థియేట్రికల్‌గా భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X