Animal Closing Collections 200 కోట్ల బడ్జెట్.. సందీప్ రెడ్డి వంగ మూవీకి ఎన్ని వందల కోట్ల కలెక్షన్లంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో టీ సీరిస్ బ్యానర్ నిర్మించిన చిత్రం యానిమల్. బాబీడియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రీ తదితర నటీనటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే?
యానిమల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీని ఇండియాలో 4000 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఇక ఈ సినిమా 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

యానిమల్ సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో థియేట్రికల్ రన్‌ను మొదలుపెట్టింది. తొలివారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లు, కర్ణాటకలో 23 కోట్ల రూపాయలు, తమిళంలో 7 కోట్లు, మలయాళంలో 2.5 కోట్లు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 315 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారమే ఈ సినిమా 400 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

ఇక రెండో వారం ఇండియాలో అన్ని భాషల్లో కలిపి యానిమల్ చిత్రం 165 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే మూడోవారంలో 65 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా టోటల్ రన్‌లో తెలుగులో 72 కోట్లు, కన్నడలో 36 కోట్లు, తమిళంలో 10 కోట్లు, మలయాళంలో 5 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 510 కోట్లు నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడు వారాల్లో 633 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో యానిమల్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా నార్ అమెరికా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ, గల్ఫ్ దేశాల్లో కలిపి భారీ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 30 మిలియన్ల డాలర్లు అంటే.. 275 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది.

ఇక యానిమల్ సినిమా ఇటీవల కాలంలో అత్యధికంగా థియేట్రికల్ రన్ కొనసాగించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా 50 రోజులపాటు ప్రదర్శించబడింది. దాంతో ఈ సినిమా హిందీలో 501 కోట్ల నికరంగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి 53 కోట్ల షేర్, 110 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను, 555 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 350 కోట్ల రూపాయల లాభాన్ని పంచిపెట్టింది.


Click it and Unblock the Notifications











