Animal Overseas Collections పఠాన్ రికార్డులు బ్రేక్.. ఓవర్సీస్‌లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. అన్ని వర్గాల నుంచి అన్ని భాషల నుంచి సానుకూల స్పందన రావడంతో తొలి రోజే వసూళ్లు ఊపందుకొన్నాయి. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కనకవర్షం కురుస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యానిమల్ సినిమాను భారీ వ్యయంతో అంటే.. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ సినిమాకు భారీగా క్రేజ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా 4000 కుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడానికి అవకాశం ఏర్పడింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో ఉత్తర అమెరికా అంటే యూఎస్, కెనడాలోను, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ తదితర దేశాల్లో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి రోజు అమెరికాలో ప్రీమియర్లతో కలిపి 2 మిలియన్లు అంటే 17 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది.
ఇక యానిమల్ చిత్రం అన్ని దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలకు సమానంగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజే ఈ సినిమా 40 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించడం రికార్డుగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఉత్తర అమెరికాలో 17 కోట్లకుపైగా, ఆస్ట్రేలియాలో 3 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 70 లక్షలకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇంకా పలు దేశాల నుంచి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. శని, ఆదివారాల్లో ఈ సినిమా ఇంకా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
యానిమల్ సినిమా ఇండియాలో తొలి రోజు కలెక్షన్ల టాప్ 10 సినిమాల్లో ఒకటిగా చేరింది. ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయలతో RRR, బాహుబలి 214 రూపాయలతో తొలి రెండు స్థానాల్లో నిలిచింది. యానిమల్ తొలి రోజు 120 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











