Animal Collections బాక్సాఫీస్ రికార్డుల మోత.. రణ్‌బీర్ కెరీర్‌లో హయ్యెస్ట్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మించిన చిత్రం యానిమల్ (Animal). బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, తెలుగు నటులు బబ్లూ పృథ్వీరాజ్, మాగంటి శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యానిమల్ సినిమాలో భారీగా నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక నిపుణుల కలయికలో నిర్మించడంతో భారీ వ్యయమైంది. యాక్టర్లు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. టీజర్, ట్రైలర్లు రిలీజ్ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఈ మూవీపై బజ్ క్రేజీగా మారడంతో భారీగా బిజినెస్ జరిగింది.

యానిమల్ సినిమా అన్ని ప్రాంతాల్లో భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ టాక్ రావడంతో 200 కోట్లకుపైగా బిజినెస్ నమోదైంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 210 కోట్ల షేర్, 400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది.
యానిమల్ సినిమా విషయానికి వస్తే.. 2023 సంవత్సరంలో మోస్ట్ అవయిటింగ్ మూవీ కావడంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు భారీగా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 4000 థియేటర్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ అన్ని ప్రాంతాల్లో నమోదైంది. దాంతో తొలివారాంతంలో భారీ కలెక్షన్లు రాబట్టడానికి అవకాశం ఏర్పడింది.

యానిమల్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 50 శాతానికిపైగా, మ్యాట్నీకి 55 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 60 శాతం కలెక్షన్లు నమోదు అయ్యాయి. హిందీ వెర్షన్‌కు అత్యధికంగా హైదరాబాద్‌లో 75 శాతం, జైపూర్‌లో 67 శాతం, చంఢీగఢ్‌లో 60 శాతం,ఢిల్లీలో 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక తెలుగు వెర్షన్ యానిమల్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 70 శాతం, మ్యాట్నీకి 72 శాతం, ఫస్ట్ షోకు 70 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 80 శాతం, విజయవాడలో 76 శాతం, వరంగల్‌లో 100 శాతం, వైజాగ్‌లో 75 శాతం, కరీంనగర్‌లో 87 శాతం, మహబూబ్ నగర్‌లో 100 శాతం, కాకినాడలో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
యానిమల్ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్‌లో తొలి రోజున 5 మిలియన్ల కలెక్షన్లు అంటే.. సుమారుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











