Animal 10 days Collections 700 కోట్లకు చేరువగా యానిమల్.. 10వ రోజు కలెక్షన్ల అరాచకం!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా కలెక్షన్ల జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సందీప్ రెడ్డి వంగా మ్యాజిక్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో వసూళ్ల ప్రభంజనం మొదలైంది. డిసెంబర్ 1వ తేదీన రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల జర్నీ ఘనంగా కొనసాగుతున్నది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన ఈ చిత్రం 700 కోట్ల కలెక్షన్ల మార్క్‌కు చేరువైన వివరాల్లోకి వెళితే..

యానిమల్ సినిమా తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 338 కోట్ల రూపాయలను వసూలు చేసింది. హిందీలో 300 కోట్ల రూపాయలు, తెలుగులో 34 కోట్ల రూపాయలు, తమిళంలో 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడ, మలయాళంలో ఓ మోస్తారు కలెక్షన్లు రాబట్టింది.

Animal Day 10 Estimated Collections Worldwide: Ranbir Kapoor movie inching towards 700 crores Club

ఇక రెండోవారాంతంలో రెండో శనివారం అంటే 9వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా హిందీ వెర్షన్ 33 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, తమిళంలో 25 లక్షల రూపాయలు, కన్నడలో లక్ష రూపాయలు, మలయాళంలో 1 లక్ష రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 9వ రోజు 33 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక రెండోవారంలో రెండో ఆదివారం అంటే 10వ రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 70 శాతం, ఫస్ట్ షోకు 70 శాతం, సెకండ్ షోకు 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఢిల్లీలో 60 శాతం, పూణేలో 70 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జైపూర్, చండీగఢ్ నగరాల్లో 50 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

Animal Day 10 Estimated Collections Worldwide: Ranbir Kapoor movie inching towards 700 crores Club

అలాగే యానిమల్ 10వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ మూవీ 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు వేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా 35 కోట్లు హిందీలో, తెలుగులో 2 కోట్ల రూపాయలు, తమిళం, మలయాళం, కన్నడలో కలిపి 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

Animal Day 10 Estimated Collections Worldwide: Ranbir Kapoor movie inching towards 700 crores Club

గత 9వ రోజుల్లో యానిమల్ చిత్రం హిందీలో 400 కోట్ల రూపాయల షేర్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 190 కోట్ల రూపాయలు వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 660 కోట్ల రూపాయాలను రాబట్టింది. 10వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ సినిమా 700 కోట్ల రూపాయలు క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X