Animal 5 days Collections చరిత్ర సృష్టించిన యానిమల్.. కలెక్షన్ల తుఫాన్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రూపొందిన యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన రీతిలో వసూళ్లను నమోదు చేస్తున్నాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ తదితరులు నటించిన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. గత నాలుగు రోజుల్లో 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం 5వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
యానిమల్ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 55 కోట్ల రూపాయలు, రెండో రోజు 58 కోట్ల రూపాయలు, మూడో రోజున 64 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం హిందీలోనే 247 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 8.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా నాలుగు రోజుల్లో ఈ చిత్రం 27 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.
యానిమల్ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో రికార్డు వసూళ్లు నమోదు చేస్తున్నది. తొలి రోజు 546,649 ఆస్ట్రేలియన్ డాలర్లు, రెండో రోజు 702,180, మూడో రోజు 701,751 డాలర్లు, నాలుగో రోజు 230,820 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో 7 మిలియన్ డాలర్లు రాబట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్, యూఏఈ, బ్రిటన్ తదితర దేశాల్లో కలిపి ఈ సినిమా 16 మిలియన్ డాలర్లు అంటే 133 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

యానిమల్ సినిమా 5వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షో 35 శాతం ఆక్యుపెన్సీని, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షో 50 శాతం, సెకండ్ షో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఢిల్లీలో 55 శాతం, పూణేలో 45 శాతం, మిగితా ప్రాంతాల్లో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.
యానిమల్ సినిమా గత నాలుగు రోజుల్లో హిందీ వెర్షన్, మిగితా భాషల్లో కలిపి వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 285 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 485 కోట్లు రాబట్టింది. ఇక 5వ రోజు కలెక్షన్లు 35 కోట్ల రూపాయలు కలిపితే ఈ సినిమా 510 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా 210 కోట్ల షేర్‌తో టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని కేవలం మూడు రోజుల్లోనే ఫినిష్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో ముందుకెళ్తున్నది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 800 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











