Animal 6 Days Collections యానిమల్ కలెక్షన్ల ఊచకోత.. 6వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యానిమల్ చిత్రం అరుదైన చరిత్రను రాసేందుకు పరుగులు పెడుతున్నది. సందీప్ రెడ్డి వంగా దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, త‌‌ృప్తి డిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతున్నది. ఈ సినిమా గత 6 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిందీ సినిమా చరిత్రను తిరగరాసే పనిలో పడింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన 12వ సినిమాగా, ఇండియాలో అత్యధిక షేర్ సాధించిన చిత్రాల్లో 12వ సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది.

Animal Day 6 Official Box Office Collection Worldwide: Rashmika Mandanna movie strong at box office

యానిమల్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. విడుదలైన అన్ని దేశాల్లోను భారీ వసూళ్లను క్రియేట్ చేస్తున్నది. యానిమల్ చిత్రం ఉత్తర అమెరికాలో అంటే.. యూఎస్ఏ, కెనడాలో కలిపి మొత్తంగా 8.5 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 70 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 145 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

గత 5 రోజుల యానిమల్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో హిందీ వెర్షన్ 250 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 312 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దక్షణాది భాషల్లో ఈ సినిమా 50 కోట్ల రూపాయలకుపైగా రాబట్టింది.

Animal Day 6 Official Box Office Collection Worldwide: Rashmika Mandanna movie strong at box office

యానిమల్ మూవీ 6వ రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం మార్నింగ్ షోకు 28 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. భోపాల్, చండీగఢ్, ఢిల్లీ, పూణే తదితర నగరాల్లో 50 శాతం, మిగితా పట్టణాల్లో 40 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగులో కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ భారీగా కనిపించింది.

Animal Day 6 Official Box Office Collection Worldwide: Rashmika Mandanna movie strong at box office

యానిమల్ సినిమా 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం హిందీ వెర్షన్ 30 కోట్ల రూపాయలు, అన్ని భాషల్లో కలిపి 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కలిపి ఈ చిత్రం సుమారుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 522 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యానిమల్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం సుమారుగా 200 కోట్లకుపైగా లాభాలను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X