Animal 23 Days Collections: RRR రికార్డు బద్దలు కొట్టిన యానిమల్.. ఏకంగా అన్ని కోట్లతో పెను సంచలనం
మిగిలిన భాషల సినిమాల హవా పెరగడంతో గతంలో కంటే బాలీవుడ్ కాస్త వెనుకబడిపోయింది. అయితే, ఈ ఏడాది మాత్రం ఆ భాషల్లో భారీ హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో మళ్లీ హిందీ పరిశ్రమకు ఊపు వచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఇటీవలే వచ్చిన క్రేజీ మూవీనే 'యానిమల్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇది RRR రికార్డు బ్రేక్ చేసింది. మరి యానిమల్ రిపోర్టును మీరే చూసేయండి మరి!
యానిమల్‌గా స్టార్ ఎంట్రీ
రణ్‌బీర్ కపూర్ హీరోగా చేసిన యాక్షన్ మూవీనే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన దీన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.

యానిమల్ మూవీ బిజినెస్
సందీప్ - రణ్‌బీర్ కలిసి చేసిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే ఊహించని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 210 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
23వ రోజు ఎంత వచ్చింది?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'యానిమల్' మూవీకి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. దీంతో ఈ మూవీకి మొదటి వారంలో రూ. 337.58 కోట్లు నెట్ వచ్చింది. అలాగే, రెండో వారంలో రూ. 139.26 కోట్లు, మూడో వారంలో రూ. 54.45 కోట్లు నెట్ వసూలు అయింది. అలాగే, 22వ రోజు రూ. 1.15 కోట్లు, 23వ రోజు రూ. 2.00 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు అయ్యాయి.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో
యాక్షన్, ఎమోషన్ కంటెంట్‌తో తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 23 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 28 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 232 కోట్లు కలెక్ట్ చేసింది.
23 రోజులకు కలిపి ఇలా
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి 23 రోజుల్లోనూ భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 23 రోజుల్లో రూ. 534.44 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ రూ. 868 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా
'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా విడుదలైంది. 23 రోజుల్లోనే ఈ సినిమా రూ. 534 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 324 కోట్లు లాభాలు సాధించింది. తెలుగులో దిల్ రాజుకు రూ. 22 కోట్లు వరకూ ప్రాఫిట్స్ ఇచ్చింది.
RRR రికార్డు బ్రేక్ చేసేసి
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి నార్త్ అమెరికాలో భారీ స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం అక్కడ ఏకంగా 14.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో RRR రికార్డు (14 మిలియన్ డాలర్లు)ను ఇది బద్దలు కొట్టేసింది. తద్వారా 'బాహుబలి 2', 'పఠాన్', 'జవాన్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











