Animal Collections: ఇండియాలో రెండో సినిమాగా యానిమల్ రికార్డు.. బాలీవుడ్ బెండు తీసిన తెలుగు డైరెక్టర్
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శకుల స్థాయి భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా కొందరు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగా ఒకడు. 'కబీర్ సింగ్'తో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న అతడు.. ఇటీవలే రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. మరి 'యానిమల్' 31 రోజుల రిపోర్టును మీరే చూసేయండి మరి!
యానిమల్‌గా రణ్‌బీర్ ఎంట్రీ
రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమానే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు.

యానిమల్ మూవీ బిజినెస్
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో వచ్చిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే ఊహించని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
31వ రోజు ఎంత వచ్చింది?
'యానిమల్' మూవీకి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. దీంతో ఈ మూవీకి మొదటి వారంలో రూ. 337.58 కోట్లు నెట్ వచ్చింది. అలాగే, రెండో వారంలో రూ. 139.26 కోట్లు, మూడో వారంలో రూ. 54.45 కోట్లు, నాలుగో వారంలో రూ. 9.57 కోట్లు నెట్ వసూలు అయింది. అలాగే, 29వ రోజు రూ. 1 కోట్లు, 30వ రోజు రూ. 1.40 కోట్లు, 31వ రోజు రూ. 1.67 కోట్లు నెట్ వచ్చింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో
క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 31 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 29 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 241 కోట్లు కలెక్ట్ చేసింది.
31 రోజులకు కలిపి ఇలా
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా రూపొందించిన 'యానిమల్' మూవీకి 31 రోజుల్లోనూ భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 31 రోజుల్లో రూ. 544.93 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ రూ. 890 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.
టార్గెట్ ఇలా.. లాభం అలా
'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా విడుదలైంది. 31 రోజుల్లోనే ఈ సినిమా రూ. 544 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 334 కోట్లు లాభాలు సాధించింది. తెలుగులో దిల్ రాజుకు రూ. 23 కోట్లు వరకూ ప్రాఫిట్స్ ఇచ్చింది.

ఇండియాలో రెండో మూవీ
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం ఇండియాలో 'పఠాన్' ఫుల్ రన్ కలెక్షన్లు (రూ. 543 కోట్లు) ఇది బ్రేక్ చేసింది. తద్వారా బాలీవుడ్‌లో 'జవాన్' తర్వాత స్థానంలో యానిమల్ చోటు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











