Animal Collections: చరిత్ర సృష్టించిన యానిమల్.. ఇండియాలో 5వ సినిమాగా రికార్డు.. బాహుబలిని దాటుతుందా!
ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మాత్రం దేశ వ్యాప్తంగా హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీ ఒకటి. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపించుకుంది. ఫలితంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మరో ఘనతను అందుకుంది. మరి ఈ మూవీ రిపోర్టును మీరే చూసేయండి!
యానిమల్‌గా బాలీవుడ్ స్టార్:రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన సినిమానే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు.

యానిమల్ మూవీ బిజినెస్:యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే ఊహించని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.
38వ రోజు ఎంత వచ్చింది?:'యానిమల్' మూవీకి మంచి టాక్ రావడంతో మొదటి వారంలో రూ. 337.58 కోట్లు నెట్ వచ్చింది. అలాగే, రెండో వారంలో రూ. 139.26 కోట్లు, మూడో వారంలో రూ. 54.45 కోట్లు, నాలుగో వారంలో రూ. 9.57 కోట్లు, ఐదో వారంలో రూ. 7.18 కోట్లు నెట్ వసూలు అయింది. అలాగే, 36వ రోజు రూ. 50 లక్షలు, 37వ రోజు రూ. 88 లక్షలు, 38వ రోజు రూ. 1.10 కోట్లు నెట్ కలెక్షన్లను రాబట్టింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో:క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 38 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 29.2 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 242.61 కోట్లు కలెక్ట్ చేసింది.
38 రోజులకు కలిపి ఇలా:రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి 38 రోజుల్లోనూ భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 38 రోజుల్లో రూ. 550.52 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ రూ. 900 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా:'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా విడుదలైంది. 38 రోజుల్లోనే ఈ సినిమా రూ. 550 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 340 కోట్లు లాభాలు సాధించింది. తెలుగులో దిల్ రాజుకు రూ. 23 కోట్లు వరకూ ప్రాఫిట్స్ ఇచ్చింది.
ఇండియాలో 5వ మూవీ:పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం తాజాగా హిందీలో రూ. 500 కోట్లు నెట్ సాధించింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన 'జవాన్', 'గదర్ 2', 'పఠాన్', 'బాహుబలి 2' తర్వాత స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











