Animal యానిమల్ కలెక్షన్ల సునామీ.. ఓవర్సీస్‌లో రికార్డులు బ్రేక్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ సినిమా కలెక్షన్ల రాబట్టడంలో సంచలనం రేపుతున్నది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా విడుదలైన అన్ని ఓవర్సీస్ సెంటర్లలో భారీ వసూళ్లు రాబడుతున్నది. ఇప్పటికే ఈ సినిమా 600 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. తాజాగా నార్త్ అమెరికాలో ఈ మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు, అమెరికాలో రికార్డు వివరాల్లోకి వెళితే..

యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా నార్త్ అమెరికా అంటే యూఎస్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్, యూఏఈ, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లో రిలీజ్ చేశారు. రిలీజైన ప్రతీ చోట ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతున్నది. ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Animal Movie North America Collections: Rashmika Mandanna joins 10 million dollars club

యానిమల్ మూవీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించింది. గత 8 రోజుల్లోనే ఈ చిత్రం 10 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 84 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన జవాన్, పఠాన్, జైలర్, గదర్ 2 సినిమాల కలెక్షన్లకు ధీటుగా వసూళ్లు రాబట్టింది.

ఇక యూఎస్‌తో పాటు మిగితా దేశాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. యానిమల్ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతున్నది. విడుదలైన అన్ని దేశాల్లోను దాదాపు 21 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 175 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇటీవల కాలంలో ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో యానిమల్ ఒకటిగా నిలిచింది.

Animal Movie North America Collections: Rashmika Mandanna joins 10 million dollars club

ఇక తొమ్మిదో రోజు యానిమల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండో శనివారం 35 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 635 కోట్ల రూపాయలు మేర నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Animal Movie North America Collections: Rashmika Mandanna joins 10 million dollars club

ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా కలెక్షన్ల వివారాల్లోకి వెళితే.. హిందీలో 365 కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో 60 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 8 రోజుల్లో 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X