Animal Telugu Collection: యానిమల్ పెను సంచలనం.. కోట్ల టార్గెట్ ఫినీష్.. నక్కతోక తొక్కిన దిల్ రాజు
బాలీవుడ్‌లో తెరకెక్కే ఎన్నో సినిమాలకు సైతం దేశ వ్యాప్తంగా హైప్ లభిస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలు టాలీవుడ్‌పైన కూడా ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన 'యానిమల్' కూడా గత వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి స్పందన లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇది కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగులో టార్గెట్ ఫినీష్ చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!
యానిమల్‌గా వచ్చిన స్టార్:రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీనే 'యానిమల్'. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు.

దిల్ రాజు చేతికి వచ్చింది:హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఏకంగా రూ. 14 కోట్లు మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ మూవీని ఆయన రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసుకున్నారు.
మూడు రోజుల్లో భారీగానే:సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం ఆరంభంలోనే డీసెంట్ టాక్ తెచ్చుకుని భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇలా మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ 20.65 కోట్లు షేర్‌తో పాటు రూ. 40.05 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది.

కోట్ల టార్గెట్ ఫినీష్ చేసి:క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'యానిమల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం రూ. 15 కోట్లు టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఇది మూడు రోజుల్లోనే రూ. 20.65 కోట్లు వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.65 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని రచ్చ లేపింది.
రణ్‌బీర్ వరుస రికార్డ్స్:బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినీష్ చేసింది. తద్వారా వేగంగా హిట్ స్టేటస్ చేరిన బాలీవుడ్ మూవీగా ఇది రికార్డు సాధించింది. అలాగే, వరుసగా రెండు చిత్రాలతో (బ్రహ్మాస్త్ర, యానిమల్) హిట్లు అందుకుని రణ్‌బీర్ రికార్డు సాధించాడు.
దిల్ రాజుకు జాక్‌పాట్:'యానిమల్' మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు.. సినిమాను స్వయంగా విడుదల చేశారు. దీంతో ఈ చిత్రం ద్వారా ఆయన మూడు రోజుల్లోనే రూ. 6 కోట్లు వరకూ లాభాలను అందుకుని జాక్‌పాట్ కొట్టేశారు. ఇదే ఊపు కొనసాగితే ఇది మరో పది కోట్లు లాభాలను కూడా అందించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











