Animal Overseas Box office Report 200 కోట్ల కొల్లగొట్టిన యానిమల్.. ఆ దేశంలో 100 కోట్ల కలెక్షన్లు!
యానిమల్ సినిమా దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్నది. విడుదలైన తొలి ఆట నుంచి రికార్డులు తిరగరాస్తూ, ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కోసం పరుగులు పెడుతున్నది. 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే 12 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో ఏ రేంజ్ కలెక్షన్లు నమోదు చేసిందనే వివరాల్లోకి వెళితే..
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న, రణ్‌బీర్ కపూర్, తృప్తి డిమ్రీ, అనిల్ కపూర్ నటించిన చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ.. ఇంతటి ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. ట్రేడ్ వర్గాల అంచనాలను పటాఫంచలు చేస్తూ ఇప్పటి వరకు 700 కోట్ల మైలురాయిని దాటి 800 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది.

ఇక యానిమల్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఉత్తర అమెరికా అంటే అమెరికా, కెనడా దేశాల్లో అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఈ రెండు దేశాల్లో 13 మిలియన్ డాలర్లు అంటే 108 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో 3.5 మిలియన్ ఆస్ట్రేలియన్ పౌండ్స్, బ్రిటన్‌లో 2.5 మిలియన్ పౌండ్స్ వసూళ్లను సాధించింది. దాంతో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు కావడానికి దోహదపడ్డాయి.
ఇక గల్ఫ్ దేశంలో 4.5 మిలియన్లు, జర్మీనలో 250K డాలర్లు, నార్వేలో 70K డాలర్లు, యూరప్‌లో 500K పౌండ్స్, ఆసియన్ పసిఫిక్ దేశాల్లో 1.5 మిలియన్ డాలర్లు, ఇతర దేశాల్లో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్ల వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 25 మిలియన్ డాలర్లు అంటే.. 210 కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.
ఇక ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో ఈ సినిమా 400 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక తెలుగు, ఇతర భాషల కలెక్షన్ల 50 కోట్లుగా నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా 11 రోజుల్లో 750 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
ఇక యానిమల్ సినిమా 12వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ఇండియాలో 15 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 18 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











