#Annaatthe బాక్సాఫీస్ ప్రభంజనం.. రూ.150 కోట్ల దిశగా.. పెద్దన్న ఫ్లాప్ షోకు కారణమేమిటంటే
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, కీర్తీ సురేష్ నటించిన తమిళ చిత్రం అన్నాతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నది. కరోనావైరస్ కారణంగా విధించిన రెండో లాక్‌డౌన్ తర్వాత వచ్చిన చిత్రాలతో పోల్చుకొంటే టికెట్ల అమ్మకాల పరంగా సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్రం బుక్ మై షో వెబ్‌సైట్‌లో ఒక మిలియన్ అంటే 10 లక్షల టికెట్లు అమ్మిన తొలి చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. ఇంకా మూడో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే...

అమెరికాలో అదనంగా షోలు
కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అన్నాతే చిత్రం ఓవర్సీస్‌లో కూడా దుమ్ము దులిపేస్తున్నది. పబ్లిక్ డిమాండ్ మేరకు అమెరికాలో ప్రఖ్యాత పాల్‌మెట్ గ్రాండే స్టేడియం 16 అదనంగా షోలు ప్రదర్శిస్తున్నారు. దాంతో వారాంతంలో అన్నాతే చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

తమిళనాడుతోపాటు ప్రపంచవ్యాప్తంగా
తొలి రోజున అన్నాతే చిత్రం తమిళంలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రభంజనం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. తమిళనాడులో రూ.34.92 కోట్లు వసూలు చేస్తే.. ఆంధ్రా, నైజాంలో రూ.3 కోట్లు, కర్ణాటకలో రూ.4.5 కోట్లు, కేరళలో రూ.1 కోటి, మిగితా రాష్ట్రాల్లో రూ.1.54 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.25.27 కోట్లు వసూలు చేసింది. దాంతో తొలి రోజున ఈ చిత్రం రూ.70 కోట్ల వసూళ్లను నమోద చేసింది.

మూడో రోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో
ఇక అన్నాతే చిత్రం రెండో రోజు కూడా వసూళ్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం. తొలి రోజున 70 కోట్లు, రెండో రోజున రూ.42 కోట్లు సాధించి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. మూడో రోజు కలెక్షన్లతో ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. తాజా వివరాల ప్రకారం మూడో రోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.

తమిళనాడులో 100 కోట్ల క్లబ్‌లో
ఇక తమిళనాడులోనే అన్నాతే చిత్రం రూ.100 కోట్లకు చేరువైంది. తొలి రోజున 35 కోట్లు, రెండో రోజున 27 కోట్లు, మూడో రోజున మరో 30 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ వారాంతంలో 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసే అవకాశం ఉంది.
Recommended Video

పెద్దన్న ఎందుకు ఆకట్టుకోలేకపోయాడంటే..
ఇక తెలుగులో పెద్దన్నగా రిలీజైన చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. రిలీజ్‌కు పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడం, ప్రమోషన్స్ అసలే చేయలేకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచలేకపోయింది. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కూడా తెలియకపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. అంతేకాకుండా సినిమా కథ రొటీన్‌గా ఉండటం కారణంగా ప్రేక్షకులు పెదవి విరిచారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











