Annaatthe, Enemy, manchi rojulu vachayi collections..తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కొట్టాయంటే?
దీపావళీ పండుగ నేపథ్యంలో విడుదలైన సినిమాలతో టాలీవుడ్ సినీ పరిశ్రమ కళకళలాడింది. స్టార్ హీరోల సినిమాలతోపాటు యువ హీరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రజనీకాంత్ నటించిన పెద్దన్న (అన్నాతే), విశాల్, ఆర్య నటించిన ఎనిమీ, తెలుగులో దర్శకుడు మారుతి రూపొందించిన మంచి రోజులు వచ్చాయి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే...

పెద్దన్న చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్
రజనీకాంత్ నటించిన పెద్దన్న ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే చేసింది. నైజాంలో ఈ చిత్రం రూ.4.5 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ చిత్రం 13 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 13.5 కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 650కిపైగా థియేటర్లలో రిలీజ్ చేసింది.

పెద్దన్న తొలి రోజు కలెక్షన్ల అంచనా
పెద్దన్న చిత్రం తెలుగు రాష్రాల్లో ఓ మోస్తారు కలెక్షన్లతో బాక్సాఫీస్ రన్‌ను ప్రారంభించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.2 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం తమిళనాట కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. తొలి రోజున మినిమం 18 కోట్ల మేర వసూలు చేయవచ్చనే రిపోర్టును ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎనిమి ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఎనిమి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలుగు ఆంధ్రాల రూ.2.5 కోట్లకుపైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. నైజాంలో ఈ సినిమా 1.5 కోట్లకుపైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తున్నది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 4 కోట్లకుపైగానే ప్రీరిలీజ్ బిజినెస్ నమోదు చేసినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఎనిమి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 5 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

ఎనిమి తొలి రోజు కలెక్షన్ల అంచనా
తెలుగు రాష్ట్రాల్లో ఎనిమి చిత్రం భారీగా థియేటర్లలో ముందుకు వచ్చింది. అయితే అక్యుపెన్సీ మాత్రం యావరేజ్‌గానే నిలిచింది. దాంతో ఈ సినిమా తక్కువలో తక్కువ 80 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా తెలుగు, తమిళంలో కలిసి ఈ సినిమా 2 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మంచి రోజులు వచ్చాయి ప్రీ రిలీజ్ బిజినెస్
దర్శకుడు మారుతి రూపొందించిన మంచి రోజులు చిత్రం దీపావళీ కానుకగా రిలీజైంది. ఈ చిత్రం ఆంధ్రాలో రూ.5 కోట్లకుపైగా, నైజాంలో 3 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. అయితే ఈ చిత్రం ఓవరాల్‌గా 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 12 కోట్ల మేరు సాధించాల్సి ఉంటుంది.
Recommended Video

మంచి రోజులు వచ్చాయి కలెక్షన్లు ఇలా..
మంచి రోజులు వచ్చాయి సినిమా బాక్సాఫీస్ రన్ పాజిటివ్‌గానే మొదలైనట్టు సమాచారం. దాదాపు విడుదలైన అన్ని చోట్ల 60 నుంచి 70 శాతం అక్యుపెన్సీ ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమా తొలి రోజు 1 నుంచి 1.5 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











