Annapoorani 4 Days Collections నయనతార మూవీని ముంచేసిన తుఫాన్.. కలెక్షన్లు దారుణంగా!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపురాణి (అన్నపూర్ణ): ది గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్న్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే నయనతార ఇమేజ్‌తో ఈ సినిమా తొలివారం ఓ రేంజ్ కలెక్షన్లను సాధించింది. అయితే తమిళనాడులో ఉన్న పరిస్థితులను ఎదురించి ఈ సినిమా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్నపురాణి సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నయనతార కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందిన అన్నపురాణి అలియాస్ అన్నపూర్ణ చిత్రంలో జై సంపత్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్‌లే తదితరులు నటించారు. ట్రైడెంట్ ఆర్ట్స్, నాడ్ స్టూడియోస్, జీ స్టూడియో నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్ నిర్మాతలుగా వ్యవహరించిన అన్నపూర్ణి సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఎస్ మ్యూజిక్ అందించారు. సత్య సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

అన్నపూర్ణ చిత్రం బడ్జెట్, బిజినెస్ విషయానికి వస్తే.. నయనతార రెమ్యునరేషన్, ఇతర ఆర్టిస్టుల పారితోషికంతో కలిపి ఈ మూవీ బడ్జెట్ 15 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తమిళ థియేట్రికల్ హక్కులను సుమారుగా 6 కోట్ల రూపాయలుగా అమ్మినట్టు తెలిసింది. ఈ దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.10 కోట్లుగా పేర్కొన్నారు.

ఇక అన్నపూర్ణ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 65 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ సినిమా 90 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. మూడో రోజు 87 లక్షలు కలెక్ట్ చేసింది.
అయితే అన్నపూర్ణ సినిమాకు 4వ రోజు తమిళనాడులో తుఫాన్ అడ్డంకిగా మారింది. దాంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మూవీ తుఫాన్ పరిస్థితుల కారణంగా దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. నాలుగవ రోజు కేవలం 30 లక్షలు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంది.
తమిళనాడును మిచాంగ్ తుఫాన్ (Cyclone Michaung) అతలాకుతలం చేస్తున్నది. ప్రధాన రహదారులన్నీ జలాశయాలుగా మారిపోయాయి. రోడ్లపైకి మొసళ్లు కూడా రావడం ఆ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో థియేటర్లు బోసిపోయాయి. తుఫాన్ పరిస్థితులు సినిమా పరిశ్రమపై భారీగా ప్రభావం చూపాయి. దాంతో అన్నపూర్ణ చిత్రం కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి.


Click it and Unblock the Notifications











