#AnniManchiSakunamule collections అన్ని మంచి శకునములేకి ఊహించని వసూళ్లు..తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్ బ్యానర్లపై నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించిన చిత్రం అన్ని మంచి శకునములే. బీవీ నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గౌతమి, రావు రమేష్, వీకే నరేష్ తదితరులు నటించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 18వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
బడ్జెట్, బిజినెస్ వివరాలు: అన్ని మంచి శకునములే మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. ఓవరాల్‌గా ఈ చిత్రాన్ని 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ జరపకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేయించారు. అయితే థియేట్రికల్ బిజినెస్ విలువను 6 కోట్లుగా అంచనా వేశారు. థియేట్రికల్‌గా 6 కోట్లు వసూలు చేస్తే లాభాలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

థియేటర్ కౌంట్ ఎంతంటే?: అన్ని మంచి శకునములే సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడం, అలాగే ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో భారీగానే రిలీజ్ చేశారు. ఈ సినిమాను నైజాంలో 100 స్క్రీన్లు, సీడెడ్‌లో 35 స్క్రీన్లు, ఆంధ్రాలో 150 స్క్రీన్ల మేర రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 285 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి మరో 260 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 550 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

తొలి రోజు ఆక్యుపెన్సీ: అన్ని మంచి శకునములే సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఉదయం ఆటకు 18 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 25 శాతం, ఫస్ట్ షోకు 20 శాతం, సెకండ్ షోకు 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఓవరాల్‌గా ఈ చిత్రం 20 శాతం ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదు చేసింది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా: అన్ని మంచి శకునములే మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్, కర్ణాటక ఇతర రాష్ట్రాలతో కలిపి ఈ చిత్రం 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











