Anni Manchi Sakunamule: మొదటి రోజే డల్గా.. వచ్చింది గోరంత.. రావాల్సింది కొండంత
టాలీవుడ్లో టాలెంట్ ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అలాంటి వారిలో సంతోష్ శోభన్ ఒకడు. సినీ నేపథ్యంతోనే పరిచయం అయినా కష్టపడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తోన్నాడు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నాడు. అవి విజయం సాధించకున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ యంగ్ హీరో ముందడుగు వేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సంతోష్ శోభన్ 'అన్నీ మంచి శకునములే' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సంతోష్ శోభన్ నటించిన 'అన్నీ మంచి శకునములే' మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫలితంగా సంతోష్ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఈ ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై చూపుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి తొలి రోజే దారుణమైన వసూళ్లు దక్కాయి.

టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'అన్నీ మంచి శకునములే' మూవీకి టాక్కు తగ్గట్లుగానే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 - 80 లక్షలు గ్రాస్, రూ. 40 లక్షలు వరకూ షేర్ను వసూలు చేసింది. అలాగే, ఓవర్సీస్లో 62 వేలకు పైగా డాలర్లను వసూలు చేసింది. అంటే.. దీనికి గ్రాస్ రూ. 50 లక్షలు వచ్చినట్లు అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ సినిమా రూ. 1.35 కోట్లు గ్రాస్, రూ. 60 లక్షలు షేర్ను మాత్రమే వసూలు చేసింది. ఇక, ఈ చిత్రం రూ. 5.50 కోట్లు షేర్ టార్గెట్తో బరిలోకి దిగగా.. ఇంకా రూ. 4.90 కోట్లు వస్తేనే హిట్ అవుతుంది.
సంతోష్ శోభన్ - లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమానే 'అన్నీ మంచి శకునములే'. మాళవిక నాయర్ హీరోయిన్గా చేసిన ఈ మూవీని స్వప్న సినిమాస్ బ్యానర్పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇందులో రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, రోహిణి వంటి పేరున్న నటీనటులు కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ దీనికి సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











