అన్నీ మంచి శకునములేకు ఊహించని బిజినెస్.. థియేటర్లు మాత్రం వందల్లో.. సంతోష్ హిట్ కొట్టాలంటే!
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో సంతోష్ శోభన్ ఒకడు. టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. హీరోగా పరిచయం అయిన తర్వాత మంచి గుర్తింపుతో ముందుకెళ్తోన్నాడు. కానీ, విజయాల కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సంతోష్ 'అన్నీ మంచి శకునములే' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్, థియేటర్ల వివరాలను చూడండి!
అన్నీ మంచి శకునములే అని: సంతోష్ శోభన్ హీరోగా లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమానే 'అన్నీ మంచి శకునములే'. మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇందులో రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, రోహిణి వంటి పేరున్న నటీనటులు కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ దీనికి సంగీతాన్ని అందించాడు.

అలాంటి కథ.. ఫ్యామిలీ డ్రామా
కుటుంబ విలువలకు కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే 'అన్నీ మంచి శకునములే'. ప్రేమించుకున్న హీరో, హీరోయిన్ల మధ్య గొడవలు జరగడం.. దీంతో వాళ్ల కుటుంబాలపై ప్రభావం పడడం వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక, ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ రావడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

భారీ ప్రమోషన్స్.. ఫుల్ సందడి: ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'అన్నీ మంచి శకునములే' సినిమాను మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా జరిగాయి. ముఖ్యంగా కొత్త రకం ప్రమోషన్స్‌తో నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
సంతోష్ మూవీకి బిజినెస్ ఇలా: సంతోష్ శోభన్ నటించిన 'అన్నీ మంచి శకునములే' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి ప్రతి పాటకు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ సినిమాకు రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్: సంతోష్ శోభన్‌కు పెద్దగా హిట్లు రావట్లేదన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే 'అన్నీ మంచి శకునములే' మూవీకి బిజినెస్ తక్కువగానే జరిగింది. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 5.00 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఇది హిట్ స్టేటస్ చేరుతుంది.
ఎక్కువ థియేటర్లలో విడుదల: 'అన్నీ మంచి శకునములే' మూవీకి ఓవరాల్‌గా థియేటర్లు మంచిగానే లభించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 100, సీడెడ్‌లో 35, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 150 థియేటర్లలో విడుదల కాబోతుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాలను కలిపి ప్రపంచ వ్యాప్తంగా 550 - 600 థియేటర్లలో ఇది రిలీజ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











