Anora Box Office: ఆస్కార్‌లో ఐదు అవార్డులు.. అనోరాకు ఎన్ని వందల కోట్ల కలెక్షన్లంటే?

ప్రపంచ సినీ తారలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్ 2025 అవార్డుల పండుగ అట్టహాసంగా జరుగుతోంది. లాస్ ఎంజెల్స్ లోని హాలీవుడ్ డాల్బీ థియేటర్ లో ఘనంగా కొనసాగుతోంది. గతేడాది 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి 'నాటు నాటు' సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెండు ఆస్కార్ అవార్డును అందుకుంది. ఎంఎం కీరవాణీ, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డులను స్వీకరించారు. ఇక ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాలే పోటీ పడుతున్నాయి.

కాగా.. 2025 ఆస్కార్స్ వేడుకలో హాలీవుడ్ ఫిల్మ్ 'అనోరా' సంచలనంగా మారింది. ఈ చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో అవార్డులు దక్కడం విశేషం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే (బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే): అనోరా (అనోరా)సీన్ బేకర్ (సీన్ బెకర్),
ఉత్తమ ఎడిటింగ్ (బెస్ట్ ఎడిటింగ్): అనోరా (అనోరా) - సీన్ బెకర్ (సీన్ బేకర్)
ఉత్తమ దర్శకుడు (బెస్ట్ డైరెక్టర్): సీన్ బేకర్ (సీన్ బేకర్) - అనోరా (అనోర)
ఉత్తమ నటి (బెస్ట్ యాక్ట్రెస్): మైకీ మాడిసన్ (మైక్ మాడిసన్) అనోరా (అనోరా)
ఉత్తమ చిత్రం (బెస్ట్ పిక్చర్): అనోరా (అనోరా)
ఇలా ప్రధాన విభాగాల్లో ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దక్కడం విశేషంగా మారింది. మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనాలు సృష్టించింది. యూఎస్, కెనడాలో భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందో తెలిసిందే. షాక్ అవ్వాల్సిందే.

Anora film Got Oscar 2025 Award in five Categories Do you know How many Hundred Crores This film was Collected

అనోరా బాక్సాఫీస్ విషయాలకొస్తే..

ఆస్కార్స్ వేడుకలో సంచలనంగా మారిన 'అనోరా' చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు దశలుగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు. ముందుగా కేన్స్ లో 2024 మే 21న విడుదలైంది. ఆ తర్వాత యూనైటెడ్ స్టైల్స్ లో 2024 అక్టోబర్ 18న విడుదలైంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని స్థాయిలో వసూళ్లు అందాయి. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 26 వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు రాబట్టింది.

యునైటెడ్ స్టేట్స్, కెనడాలో 'అనోరా' చిత్రానికి మొత్తం 15.7 మిలియన్ల డాలర్ల కలెక్షన్ అందింది. ఇతర ప్రాంతాల్లో 25.2 మిలియన్ల డాలర్లు వసూల్ చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40.9 మిలియన్లు డాలర్లు వసూల్ చేసింది. ఇండియన్ కరెన్సీలో 357 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మొదటి రోజు 5 లక్షల 50 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. అది కూడా కేవలం ఆరు థియేటర్ల నుంచి ఈ మొత్తం వసూల్ చేసింది.

ఈ సందర్భంగానూ ఒక్కో థియేటర్ నుంచి 91 వేల డాలర్లకు పైగా వసూళ్లు అందుకొని... 2024లో 75 వేల డాలర్లను అందుకున్న చిత్రం 'కైండ్స్ ఆఫ్ కైండ్ నెస్' రికార్డును చెరిపేసింది. దీంతో థియేటర్ల సంఖ్యను కూడా పెంచుకుంది. మొదటి వారం 34, రెండో వారం 253, నాలుగో వారం 1,104 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఏదేమైనా ఈ చిత్రం ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు, శుభాకాంక్షలు అందుతున్నాయి.

More from Filmibeat

Read more about: oscars 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X