AntMan and the Wasp Quantumania Collections: 1000 కోట్లకు చేరువగా యాంట్ మ్యాన్..ఇండియాలో ఆ సినిమా కంటే ఎక్కువే
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ రూపొందించిన యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్: క్వాంటుమేనియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నది. మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం తొలి వారంలో రికార్డు వసూళ్లు సాధించింది. వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు రావడంతో కలెక్షన్లపరంగా ఇరుగదీసింది. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో వసూలు చేసిందంటే?

ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ కలెక్షన్లు
యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ సినిమా ఇండియాలో భారీగానే వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌కు సంబంధించిన మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 6.7 కోట్లు, రెండో రోజు 7.3 కోట్లు, మూడో రోజు 5.85 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారు 20 కోట్లు రాబట్టింది.

యాంట్ మ్యాన్ హిందీ వెర్షన్
ఇక యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు 1.7 కోట్లు, రెండో రోజు 2 కోట్లు, మూడో రోజు 2.31 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో 6 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ వెర్షన్లలో కలిపి 26 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇటీవల రిలీజైన షెహజాదా సినిమా కంటే ఎక్కువగా వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది.

తొలివారాంతంలో 1000 కోట్లకు చేరువగా
ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు, రెగ్యులర్ షోలతో యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. గత నాలుగు రోజుల్లో చిత్రం 118 మిలియన్ అమెరికన్ డాలర్లను అంటే సుమారు 974 కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.

యాంట్ మ్యాన్ సిరీస్‌లో టాప్‌గా
యాంట్ మ్యాన్ ఫ్రాంచైజీలో యాంట్ మ్యాన్ ది వాస్ప్: క్వాంటుమేనియా చిత్రం ఐదోవది. గతంలో 2015లో రిలీజైన యాంట్ మ్యాన్ 1 చిత్రం తొలి వారాంతానికి 57 మిలియన్ డాలర్లు రాబట్టింది. అలాగే రెండో యాంట్ మ్యాన్ చిత్రం 76 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. యాంట్ మ్యాన్3, యాంట్ మ్యాన్ 4 పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ యాంట్ మ్యాన్ 5 చిత్రం 118 మిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో యాంట్ మ్యాన్
యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 26 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపితే.. ఈ చిత్రం సుమారు 1000 కోట్లకు చేరువైంది. అత్యంత వేగంగా 1000 కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











