Ante Sundaraniki advance booking నాని మూవీకి ఊహించని రెస్పాన్స్.. శ్యామ్ సింగరాయ్ కంటే దారుణంగా..
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మలయాళ ముద్దుగుమ్మ నాజ్రియ నాజిం హీరోయిన్‌గా నటించిన అంటే సుందరానికి చిత్రం జూన్ 10వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి లాంటి టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ బలంగా మారారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. అయితే ఇలా పుష్కలంగా క్రెడిట్స్ ఉన్న ఈ సినిమాకు ఊహించినంతగా బజ్ క్రియేట్ రాకపోవడం ఆశ్చర్యంగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయంటే?

శ్యామ్ సింగరాయ్ కంటే తక్కువగా
గతంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం అడ్వాన్సు బుకింగ్ పరంగా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక అంటే సుందరానికి చిత్రం విషయానికి వస్తే.. మెల్లగా సాగుతున్నది. చాలా చోట్ల భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైనట్టు కనిపించలేదు. అయితే కరెంట్ బుకింగ్ వల్ల ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంటే సుందరానికి థియేటర్ కౌంట్
అంటే సుందరానికి ప్రపంచవ్యాప్తంగా 1100 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. నైజాంలో 210, సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 250 థియేటర్లకుపైగా, మిగితా రాష్ట్రాల్లో 150కిపైగా, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఏపీ, తెలంగాణలో 550 థియేటర్లతో కలిపి మొత్తం 1100 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది.

హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్
అంటే సుందరానికి టైటిల్ చూస్తే.. క్లాసీగా అనిపించడమే కాకుండా మల్టీప్లెక్ష్ సినిమా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ బలంగా ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 212 షోల ద్వారా ఈ చిత్రం 35 శాతం అక్యుపెన్సీతో రిలీజ్‌కు ఒక రోజు ముందు వరకు 74 లక్షలు వసూలు చేసింది. అయితే కరెంట్ బుకింగ్ ద్వారా మరింత మెరుగైన వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

యూఎస్‌లో ఎలా ఉందంటే?
అంటే సుందరానికి మూవీకి యూఎస్‌ఏలో ఓ మోస్తారు అడ్వాన్సు బుకింగ్ నమోదైంది. ఈ చిత్రం 278 లొకేషన్లలో 645 షోల ద్వారా 135k డాలర్లు రాబట్టింది. కరెంట్ బుకింగ్ ద్వారా ప్రీమియర్లతోపాటు తొలి రోజు కనీసం 500k డాలర్లు నమోదు చేయడానికి అవకాశం ఉంది. అయితే గురువారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బజ్ క్రియేట్ అయితే మరింత కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ లేకపోలేదు అని అంటున్నారు.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ ఇలా..
అంటే సుందరానికి సంబంధించి ఓవర్సీస్‌లో అడ్వాన్సు బుకింగ్ నెమ్మదిగా ఊపందుకొంటున్నది. ఆస్ట్రేలియాలో 50 లోకేషన్లలో 83 షోల ద్వారా 960 టికెట్లు అడ్వాన్సు బుకింగ్ రూపంలో తెగాయి. యూకేలో అడ్వాన్సు బుకింగ్‌కు రెస్పానస్ కొంచెం బెటర్‌గా కనిపిస్తున్నది. కడపటి వార్తలు అందేసరికి 59 లొకేషన్లలో 83 షోల ద్వారా 4360 టికెట్లు అమ్ముడుపోయాయి.


Click it and Unblock the Notifications











