Ante Sundaraniki day 1 collections నాని మూవీ అంచనాలను మించిందా? తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని, మలయాళ ముద్దు గుమ్మ నజ్రియ నజీం జంటగా నటించిన అంటే సుందరానికి చిత్రం జూన్ 10 థియేటర్లలోకి వచ్చింది. అయితే గత చిత్రాలతో పోల్చుకొంటే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం పడినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

అమెరికాలో ప్రీమియర్ల ద్వారా

అమెరికాలో ప్రీమియర్ల ద్వారా


గతంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్‌తోపాటు పలు చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే శ్యామ్ సింగరాయ్‌తో పోల్చుకొంటే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇక ప్రీమియర్ల వసూళ్లు అమెరికాలో 228 లొకేషన్ల నుంచి 212,653 డాలర్లు వసూలు చేసింది.

యూకే, ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్స్

యూకే, ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్స్


ఇక యూకేలో అంటే సుందరానికి చిత్రం ఓ మోస్తారు వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. యూకేలో 60 లోకేషన్లలో 87 షోల ద్వారా 5600 టికెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా ఆస్ట్రేలియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ పరంగా 49 లోకేషన్లలో 83 షోల ద్వారా 1500 లకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి.

హైదరాబాద్‌లో తొలి రోజు అంచనా

హైదరాబాద్‌లో తొలి రోజు అంచనా


అంటే సుందరానికి మూవీ హైదరాబాద్‌ నగరంలో అడ్వాన్స్ బుకింగ్ ఫర్వాలేదనిపించింది. 42 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో ఈ చిత్రం 373 షోల ద్వారా 1.36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 2.6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అంటే సుందరానికి కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా అంటే సుందరానికి కలెక్షన్లు


ఇక ప్రపంచవ్యాప్తంగా అంటే సుందరం చిత్రం అమెరికాలో ప్రీమియర్లతోపాటు తొలి రోజు కలెక్షన్లు కలుపుకొని 400k డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ప్రీమియర్లతోపాటు తొలి రోజు కలెక్షన్లు 3 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లు, తమిళనాడులో 6 లక్ష, మలయాళంలో 30 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే కర్ణాటకలో 13 లక్షలు రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో మొత్తంగా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది.

నాని మూవీ లాభాల్లోకి రావాలంటే..

నాని మూవీ లాభాల్లోకి రావాలంటే..

అంటే సుందరానికి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది. నైజాంలో 10 కోట్లకు, సీడెడ్‌లో 4 కోట్లకు, ఆంధ్రాలో 10 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్లు, ఓవర్సీస్‌లో 3.5 కోట్లు బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 31 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X