Ante Sundaraniki day 1 collections worldwide.. నాని సినిమాకు అలాంటి దెబ్బ.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన అంటే సుందరానికి చిత్రం విడుదలైన అన్ని చోట్ల యావరేజ్ కలెక్షన్లను రాబట్టింది. నాని, నజ్రియా నజీం నటించిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను నమోదు చేయలేకపోయింది. నాని, నజ్రియా, నరేష్, నదియా లాంటి వాళ్లు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా.. సినిమా నిడివి, స్క్రీన్ ప్లే కారణంగా సినిమా విమర్శకులను, సగటు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నది. ఈ క్రమంలో అంటే సుందరానికి చిత్రం తొలి రోజున ఎంత వసూలు చేసిందంటే..

అమెరికాలో ప్రతీకూలంగా
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. అమెరికాలో జురాసిక్ వరల్డ్ డొమినియన్, టాప్ గన్ సినిమాల రూపంలో, కర్ణాటకలో 777 చార్లీ సినిమా వల్ల, అలాగే తమిళనాడులో విక్రమ్ జోరు కారణంగా వసూళ్లపై ప్రభావం పడింది. చాలా చోట్ల థియేటర్లు లభించలేదని తెలిసింది. అయినా ఇలాంటి బలమైన పరిస్థితులను తట్టుకొని యావరేజ్ కలెక్షన్లను రాబట్టింది.

యూఎస్ తొలి రోజు కలెక్షన్లు
అమెరికాలో అంటే సుందరానికి చిత్రం ఒకే రేంజ్‌లో వసూళ్లను సాధించింది. 302 లొకేషన్లలో ప్రీమియర్ల ప్రదర్శించడం ద్వారా 237k డాలర్లు, తొలి రోజున 198k డాలర్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా తొలి రోజు ముగిసే సమయానికి 435k డాలర్లు రాబట్టింది. భారతీయ కరెన్సీలో 3.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆంధ్రాలో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో అంటే సుందరానికి 44 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 34 లక్షలు, ఏలూరు సిటీలో 3.7 లక్షలు, విజయనగరం సిటీలో 2.6 లక్షలు, మాచర్లలో 91 వేలు, చీరాలలో 1.56 లక్షలు, వైజాగ్‌లో 4.32 లక్షలు, నంద్యాల టౌన్ 2.89 లక్షలు, గుంటూరు 33 లక్షలు, శ్రీకాకుళం టౌన్ 4.73 లక్షలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు
నైజాంలోని పలు ప్రాంతాల్లో ఫర్వాలేదనే విధంగా కలెక్షన్లను సాధించింది. తొలి రోజున అన్ని ప్రాంతాల్లో కలుపుకొని ఈ చిత్రం నైజాంలో 1.56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సీడెడ్‌లో 38 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 34 లక్షలు, నెల్లూరు జిల్లాలో 19 లక్షలు వసూలు చేసింది. దాంతో నైజాం, ఆంధ్రాలో కలిపి 3.87 కోట్ల షేర్, 6.50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?
అంటే సుందరానికి చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్లపరంగా ఫర్వాలేదనిపించింది. అయితే నాని ఇతర సినిమా ఓపెనింగ్స్‌తో పోల్చుకొంటే నిరాశను కలిగించిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజున 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లాభాల్లోకి రావాలంటే..
నాని నటించిన అంటే సుందరానికి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే వెలకట్టారు. ఈ సినిమా వ్యాల్యూను 30 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 31 కోట్ల రూపాయాలు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా తొలి రోజు 4 కోట్ల షేర్ సాధించింది. రాబోయే రోజుల్లో కనీసం 27 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











