Ante Sundaraniki day 3 collections.. బాక్సాఫీస్ వద్ద పేలవంగా వసూళ్లు.. లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే?
నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజిం జంటగా నటించిన అంటే సుందరానికి బాక్సాఫీస్ ప్రయాణం నిరాశజనకంగానే కొనసాగుతున్నది. అయితే నాని కెరీర్‌లోనే ముందెన్నడూ లేని విధంగా దారుణమైన వసూళ్లను నమోదు చేస్తున్నది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం స్లో నేరేషన్, నిడివి లాంటి సమస్యల కారణంగా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలను సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రతికూలతల మధ్య అంటే సుందరానికి సినిమా 3వ రోజు ఎంత వసూలు చేసిందంటే..

50 శాతం కంటే తక్కువ రికవరీ..
అంటే సుందరానికి తొలి వారాంతాన్ని ఒడిదుడుకుల మధ్య పూర్తి చేసుకొన్నది. తొలి వారాంతంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోయింది. అత్యంత పేలవమైన వసూళ్లను రాబడుతున్నది. అయితే లిట్మస్ టెస్ట్ లాంటి సోమవారం నిలకడగా సాధిస్తే తప్ప.. ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొనే అవకాశాలు కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు
అంటే సుందరానికి ఏపీ, తెలంగాణలో మూడో రోజున ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. భీమవరంలో మూడో రోజు 3.6 లక్షలు, ఖమ్మంలో 3.25 లక్షలు, వసూలు చేసింది. కృష్ణా జిల్లాలో 23 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, ఉత్తరాంధ్రలో 32.25 లక్షలు, ఏలూరులో 3.56 లక్షలు, అనంతపురం సిటీలో 5.38 లక్షలు, చిత్తూరు టౌన్‌లో 1.7 లక్షలు, గుంతకల్ 91 వేలు, హైదరాబాద్ ఎక్స్ రోడ్‌లో 4.36 లక్షలు వసూలు చేసింది.

ఏపీ, నైజాంలో 3 రోజులు కలెక్షన్లు
గత మూడు రోజుల అంటే సుందరానికి కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 4.40 కోట్లు, సీడెడ్‌లో 105 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 0.76 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 72 లక్షలు, గుంటూరు జిల్లాలో 79 లక్షలు, కృష్ణా జిల్లాలో 74 లక్షలు, నెల్లూరు జిల్లాలో 48 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల షేర్, 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

అమెరికాలో ఎంతంటే?
అంటే సుందరానికి చిత్రం అమెరికాలో ప్రభావం చూపలేకపోయింది. సోమవారం సానుకూలంగా ఉంటే 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది. మూడో రోజున 286 లోకేషన్ల నుంచి 131k డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత మూడు రోజుల్లో 819k వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలంటే?
ఇక కర్ణాటక, తమిళనాడుతోపాటు ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లో 90 లక్షలు షేర్, 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 3.65 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14.64 కోట్ల షేర్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 30 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











