బాక్సాఫీస్ రిపోర్ట్: ‘అంతరిక్షం’ నష్టపోకూడదంటే ఎంత వసూలవ్వాలి?
వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం'. తెలుగులో వచ్చిన తొలి స్పేస్ మూవీ ఇది. ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.
ప్యూర్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిని 'అంతరిక్షం'పై ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా మొదటి భాగం చాలా స్లోగా సాగడం, సెకండాఫ్ ఎబో యావరేజ్‌గా ఉందనే టాక్ కావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.

బాక్సాఫీసు వద్ద తీవ్రమైన పోటీ
డిసెంబర్ 21న ‘అంతరిక్షం'తో పాటు కెజిఎఫ్, పడి పడి లేచె మనసు, హిందీ చిత్రం ‘జీరో' విడుదలవ్వడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇది కూడా సినిమాకు ఓపెనింగ్స్ తగ్గడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

తొలి రోజు ఎంత వసూలైంది?
‘అంతరిక్షం' చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.2 కోట గ్రాస్ వసూలు చేసింది. సినిమాపై ఇంత హైప్ ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ గత చిత్రాల ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టడంలో విఫలమైంది.

వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్
సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉండటంతో పిల్లలతో కలిసి చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపడంతో శని, ఆదివారాల్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో ఫెయిలైంది.

ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్ ఎంత?
‘అంతరిక్షం' చిత్రం ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ పరిశీలిస్తే.... ఓవరాల్ రూ. 9.50 కోట్లు రాబట్టింది. అయితే ఈ వసూళ్లు వరుణ్ తేజ్ గత ప్లాప్ చిత్రాలైన లోఫర్, మిస్టర్ చిత్రాలకంటే తక్కువగా ఉండటం కాస్త ఆందోళన కలిగించే విషయమే.

డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదంటే..?
ఫస్ట్ వీకెండ్ ‘అంతరిక్షం' చిత్రం రూ. 3.70 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలకు కలిపి థియేట్రికల్ రైట్స్ రూ. 21 కోట్లకు అమ్మారు. ఇంకా 18 కోట్లు షేర్ వసూలైతే తప్ప సినిమా లాభాల్లోకి వెళ్లే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











