Anubhavinchu Raja day 2 collections రాజ్ తరుణ్‌కు హిట్టా? ఫట్టా? బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా అంటే?

గత కొద్ది సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యువ హీరో రాజ్ తరుణ్ నటించిన చిత్రం అనుభవించు రాజా. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు కాగా, కశీష్ ఖాన్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన రాజ్ తరుణ్‌ సినిమాకు తొలి రోజు ఎలాంటి వసూళ్లు రాబట్టింది? రెండో రోజు ఎంత వసూలు చేయవచ్చనే విషయంలోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో

ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో

గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్ తరుణ్ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 థియేటర్లలో అనుభవించు రాజా చిత్రం రిలీజైంది. నైజాంలో దాదాపు 160 థియేటర్లు, సీడెడ్‌లో 85 థియేటర్లు, ఆంధ్రాలో 200 థియేటర్లలో రిలీజైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే

ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే


ఇక అనుభవించు రాజా ట్రైలర్లు, టీజర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.3.2 కోట్ల మేర జరిగింది. ఓవర్సీస్ బిజినెస్ కలిపితే ఈ చిత్రం రూ.3.5 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ వెల్లడించింది. అయితే 4 కోట్ల మేర బాక్సాఫీస్ టార్గెట్‌తో బరిలోకి అనుభవించు రాజా దిగాడు.

తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా అక్యుపెన్సీ

తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా అక్యుపెన్సీ

అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులను అనుభవించు రాజా ఆకట్టుకోలేకపోయిందనే విషయం స్పష్టమైంది. మార్నింగ్ షోలో సుమారు 20 శాతం అక్యుపెన్సీ, మ్యాట్నీ షోలకు 15 నుంచి 20 శాతం అక్యుపెన్సీ, ఫస్ట్ షో 16 శాతానికి పైగా, సెకండ్ షోలకు 16 శాతం అక్యుపెన్సీ లభించింది.

తొలి రోజు అనధికారిక కలెక్షన్లు

తొలి రోజు అనధికారిక కలెక్షన్లు

అనుభవించు రాజా సినిమా తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.70 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే దాదాపు 50 లక్షల నికర వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తున్నది. అధికారికంగా వసూళ్లు వెల్లడించాల్సి ఉంది.

రెండో వసూళ్ల అంచనా ఇలా..

రెండో వసూళ్ల అంచనా ఇలా..

ఇక రెండో రోజు కూడా అనుభవించు రాజా అక్కుపెన్సీ కూడా అంతంతా మాత్రంగానే ఉంది. రెండో రోజు కూడా తొలి రోజు సాధించినట్టుగానే 70 లక్షల రూపాయల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నారు. అయితే రెండో రోజు ఏదైనా పెరుగుదల ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.

లాభాల్లోకి రావాలంటే ఇంత వసూలు చేయాలంటే

లాభాల్లోకి రావాలంటే ఇంత వసూలు చేయాలంటే

ఇదిలా ఉంటే, అనుభవించు రాజా చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.4 కోట్లకుపైగా రాబట్టాల్సి ఉందనేది ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఇప్పటి పరిస్థితి చూస్తే ఇంకా భారీగా వసూళ్లను రాబట్టాల్సి ఉందనేది స్పష్టంగా కనిపిస్తున్నది. రెండు రోజుల్లో 1 కోటి రూపాయలకుపైగా సాధిస్తే.. ఇంకా భారీ లక్ష్యమే అనుభవించు రాజా ముందు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X