హై బడ్జెట్ చిత్రాలు మూడింటిలోనూ అనుష్క
మొదటగా.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో అనుష్క,ఆర్య కాంబినేషన్ లో రూపొందుతున్న వర్ణ చిత్రం లో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోంది. దానికి తోడు చిత్రం కథ...ఐదో శతాబ్దంలో జరుగుతుంది. విజువల్ గా ఓ ఫీస్ట్ లా ఉండనుంది. పివివి వారు నిర్మిస్తున్న ఈ చిత్రం 55 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది.
మరో ప్రక్క ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత దేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా 'రుద్రమదేవి'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న 'రుద్రమదేవి' షూటింగ్ ఏప్రిల్ 27 న మొదలైంది. ఒక్కడు మూవీకి చార్మినార్ సెట్ నిర్మించిన గోపన్నపల్లిలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎరీనా సెట్‌లో షూటింగ్ ప్రారంభించారు. 'రుద్రమదేవి' చిత్రం కోసం యాభై కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ ని వేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి చిత్రం బడ్జెట్ 75 కోట్లు అని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో అనుష్క పాత్ర పాటలకే పరిమితం కాదని సమాచారం. ఇలా ఈ మూడు చిత్రాలు ద్వారా అనుష్క భారీ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది.


Click it and Unblock the Notifications












