»   » 'బాహుబలి' ఎఫెక్టు ... 'రుద్రమదేవి' కూడా అదే దారి

'బాహుబలి' ఎఫెక్టు ... 'రుద్రమదేవి' కూడా అదే దారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి భారీ చిత్రం 'బాహుబలి' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొలదీ... మిగతా సినిమాలు తప్పుకుని దారి ఇస్తున్నట్లున్నాయి. తాజాగా 'రుద్రమదేవి' చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే విజువల్ ఎఫెక్టు పనుల వల్లే లేటు అని చెప్పుతున్నారు. ఈ నేపధ్యంలో రుద్రమదేవి...ఆగస్టు తర్వాత మాత్రమే రిలీజ్ కు సమయం దొరికేటట్లు ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.


దర్శకనిర్మాత మాట్లాడుతూ ''ముందు చెప్పినట్టుగా ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయడం లేదు. సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.


Anushka's Rudramadevi postponed

సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.


బాహుబలి చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్.ఎస్.రాజామౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వెనుక ఆయన రెండేళ్ల కృషి, తపన దాగి ఉంది.


ఓ యజ్ఞంలా భావించి బాహుబలి చిత్రాన్ని వెండితెర దృశ్యమానం చేస్తున్నారాయన. ప్రతి సన్నివేశాన్ని ఓ శిల్పంలా తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారీ దర్శక బాహుబలి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఎస్.ఎస్.రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.


ప్రభాస్ నటన గురించి చెప్తూ.... ప్రభాస్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాడు. సినిమాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రభాస్‌తో నాకు మంచి అనుబంధముంది. నిజజీవితంలో కూడా మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే తీరుగా ఉంటాయి.


బాహుబలి పాత్రను చాలా ప్రేమించి చేశాడు. తన క్యారెక్టర్ మాత్రమే కాకుండా అన్ని పాత్రలు సరిగా రావాలని నిరంతరం తపించాడు. ఏ సన్నివేశంలో ఎలా ఉండాలి? ఆ సన్నివేశానికి తగినట్లుగా ఉండే భావోద్వేగాలేంటి? అని ఎప్పుడు ఆలోచిస్తూనే గడిపాడు. అతడి కష్టం వల్ల నేను పెద్దగా హోమ్‌వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అన్నారు.

English summary
Hear that the makers are looking forward to postpone the release date. It is also being heard that director Gunasekhar is in talks with the distributors to push the release date of the film.
Please Wait while comments are loading...