బాక్సాఫీస్ వద్ద సూయి ధాగా జోరు.. 50 కోట్ల మార్క్‌ను దాటేసి..
బాలీవుడ్ తారలు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ నటించిన సూయి ధాగా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నది. విడుదలైన ఐదో రోజున ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును దాటేయడం సినీ ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
రిలీజ్ రోజున రూ.8.30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వారాంతంలో కూడా కలెక్షన్ల సత్తాను చూపించింది. శనివారం రూ.12.25 కోట్లు, ఆదివారం రూ.16.05 కోట్లు రాబట్టింది. దాంతో వారాంతంలో మొత్తంగా రూ.36.60 కోట్లు వసూలు చేసింది.

సినిమా కలెక్షన్లకు అగ్ని పరీక్షగా మారే సోమవారం రోజున సూయి ధాగా భారీ కలెక్షన్లను సాధించింది. సోమవారం ఈ చిత్రం రూ.7 కోట్లు వసూలు చేయడం గమనార్హం. మంగళవారం గాంధీ జయంతి సెలవు దినం కావడంతో మరో రూ.6.40 కోట్లు రాబట్టింది. దాంతో రూ.50 కోట్ల మార్కును దాటింది.
శరత్ కటారియా దర్శకత్వం వహించిన సూయి ధాగా చిత్రం ఐదో రోజున కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం రూ.55 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











