Miss Shetty Mr Polishetty తొలివారంలోనే మిస్ శెట్టి లాభాల్లోకి.. మిస్టర్ పోలిశెట్టి మూవీకి లాభాలు ఎంతంటే?
దక్షిణాదిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన విభిన్నకథా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యువ దర్శకుడు పీ మహేష్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మొత్తంగా 25 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే అంటే 14 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 14.5 కోట్లుగా నిర్ణయించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 14.5 కోట్ల షేర్, 28 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీకి సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. పెరిగిన అంచనాలకు తగినట్టే ఈ సినిమాను 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మొదటి రోజే హిట్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 4.55 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 6.7 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 8.45 కోట్ల కూపాయల గ్రాస్ , ఐదో రోజు 2.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇక 6వ రోజు ఇండియాలో 1.5 కోట్ల రూపాయలు, ఒవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఇండియాలో 16 కోట్లు షేర్, ప్రపంచవ్యాప్తంగా 29 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











