Miss Shetty Mr Polishetty Collections షాకింగ్‌గా అనుష్క మూవీ కలెక్షన్లు.. నవీన్ పొలిశెట్టికి ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ జేజేమ్మ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా యువ డైరెక్టర్ మహేష్ బాబు పీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు తొలి ఆట నుంచి పాజిటివ్ రివ్యూస్ సానుకూలంగా మారాయి. అమెరికాలో ప్రీమియర్లకు హిట్ టాక్ రావడంతో ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెన్సింగ్స్ లభించాయి. ఆ తర్వాత మీడియా, క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూలు రావడంతో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది.

 Miss Shetty Mr Polishetty

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఉదయం ఆట కొంత నిదానంగానే ఆక్యుపెన్సీ నమోదైంది. పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు మధ్యాహ్నం నుంచి ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. అత్యధికంగా హైదరాబాద్, కాకినాడ. గుంటూరు, వరంగల్ జిల్లాలో 45 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.

ఓవర్సీస్ ప్రేక్షకులు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు పాజిటివ్‌గా స్పందించారు. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 200K కలెక్షన్లు సాధించింది. తొలి రోజు, రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. వారాంతంలో ఈ సినిమా ఓవర్సీస్‌లో మరింతగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

 Miss Shetty Mr Polishetty

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగానే కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా నైజాంలో 70 లక్షలు, ఆంధ్రాలో 80 లక్షల షేర్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియా వైడ్ ఈ సినిమా 3.5 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

 Miss Shetty Mr Polishetty

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఈ సినిమా మొత్తంగా 3.5 కలెక్షన్ల నుంచి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. థియేట్రికల్‌గా 5.5 కోట్ల షేర్ వసూలు చేస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X