Miss Shetty Mr Polishetty box office Report ఊపందుకొన్న కలెక్షన్లు.. అనుష్క శెట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?

యువ హీరో నవీన్ పొలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ బజ్‌తో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ మూవీ రెండో రోజు కలెక్షన్ల అంచనాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని దాదాపు 25 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్లకు మంచి క్రేజ్ ఏర్పడటంతో మూవీ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 13.5 కోట్లుగా నిర్ణయించారు.

 Anushka Shetty

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగానే కలెక్ట్ చేసింది. నైజాంలో 50 లక్షల షేర్, సీడెడ్‌లో 10 లక్షల రూపాయలకుపైగా షేర్, ఏపీలో 45 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 1 కోటికిపైగా షేర్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో రోజు అమెరికాలో ఈ చిత్రం 400K డాలర్లు అంటే.. 36 లక్షలు రూపాయలు వసూలు చేసింది. వారాంతంలో ఇంకా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో కలిపి 2 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం మొదటి రోజు 3.5 కోట్లు, రెండో రోజు మరో 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 6 నుంచి 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X