Miss Shetty Mr Polishetty Day 4 Collections: సండే కలిసొచ్చింది.. ఊపందుకున్న కలెక్షన్లు.. ఆ దేశంలో సంచలనం
జాతీ రత్నాలు తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ మహేష్ బాబు రూపొందించారు. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ సాధిస్తోంది. ఈ మూవీ నాలుగో రోజు కలెక్షన్ల అంచనాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఏర్పడటంతో... ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12.5 కోట్ల రూపాయల బిజినెస్ నమోదు చేసుకుంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.5 కోట్లతో థియేటర్లోకి వచ్చింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే... మొదటి రోజు రూ. 2.90 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ. 1.21 కోట్లు షేర్, రూ. 1.95 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక 3 రోజుల్లో రూ. 4.64 కోట్లు షేర్, రూ. 8.45 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 8.84 కోట్లు షేర్, రూ. 17.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇక నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే... దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ. 3.25 కోట్ల షేర్ రాబట్టనుందని ట్రెడ్ వర్గాల సమాచారం. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.11.03 కోట్ల షేర్ రాబట్టనుందని లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో ఓవర్సీస్ లో రూ.8 కోట్లు రాబట్టగా.. అన్ని కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.21కోట్ల గ్రాస్ రాబట్టనుందని ట్రెడ్ వర్గాల సమాచారం.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో రోజు అమెరికాలో ఈ చిత్రం 400K డాలర్లు అంటే.. 36 లక్షలు రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు ఓవర్సీస్‌లో 800K డాలర్లు షేర్ వసూలు చేసింది. ఇక నాలుగో రోజు 900K డాలర్లు వసూలు చేయగా.. అంటే 7.48కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక థియేటర్ ఆక్యూపెన్సీ విషయానికి వస్తే... తెలుగులో నాలుగో రోజు అయిన ఆదివారం నాడు ఉదయం 43.71% శాతం, మధ్యాహ్నాం 72.98% శాతం, సాయంత్రం 75.42% శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.


Click it and Unblock the Notifications











