Miss Shetty Mr Polishetty Collections రికార్డు క్రియేట్ చేసిన అనుష్క శెట్టి మూవీ.. ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌తో న
దక్షిణాదిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన కామెడీ, ఎమోషనల్ డ్రామా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. యువ దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు వారాలుగా స్టడీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా 20వ రోజున అరుదైన మైలురాయిని అందుకొన్నది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం తొలి రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లను పెంచుకొంటూ పోయింది. తొలివారంలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండోవారంలో కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడో వారంలో ఓవర్సీస్‌లో స్క్రీన్లను కూడా పెంచడం జరిగింది. దాంతో వసూళ్లు మరింత వేగం పుంజుకొన్నాయి.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం తొలివారం భారీగా ఒపెనింగ్స్ సాధించింది. తెలుగులో 18 కోట్ల రూపాయలు, తమిళంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలివారంలో 18.30 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండోవారంలో నిలకడగా వసూళ్లు సాధించింది. తెలుగులో రెండోవారం 6.6 కోట్లు, తమిళంలో 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో వారం ఆరంభంలో 50 కోట్ల మైలురాయిని దాటింది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 33 కోట్లకుపైగా గ్రాస్, ఓవర్సీస్‌లో ఈ చిత్రం 17 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో 20వ రోజు ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. 25 కోట్లతో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 14 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ సినిమా 15 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలివారమే లాభాల్లోకి ప్రవేశించింది. దాంతో ఈ సినిమా తక్కువ బడ్జెట్ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ స్టాటస్‌ను అందుకొన్నది.


Click it and Unblock the Notifications











