Anweshippin Kandethum Collections టొవినో థామస్ మూవీకి కలెక్షన్ల వర్షం.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
మలయాళ స్టార్ టోవినో థామస్ నటించిన తాజా చిత్రం అన్విషిప్పిన్ కండేథమ్ అన్వెషిప్పిన్ కండేథుమ్ (Anweshippin Kandethum Collectiosn) . డార్విన్ కురియాకోస్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రంలో సిద్దిఖి, అర్థనా బిను తదితరులు నటించారు. ఈ సినిమాను జిను అబ్రహం నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కథను కూడా అందించారు. దర్శకుడు డార్విన్ సహ నిర్మాత కావడం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలతోపాటు భారీ కలెక్షన్లు కూడా నమోదు అవుతున్నాయి. ఈ సినిమా కథేంటి? బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
క్రైమ్ డ్రామా, మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన అన్వెషిప్పిన్ కండేథుమ్ (Anweshippin Kandethum) 1990 జరిగిన కథగా తెరకెక్కింది. ఆనంద్ నారాయణ్ (టోవినో థామస్) కొట్టాయం జిల్లాలోని ఓ గ్రామంలో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా జాయిన్ అవుతాడు. ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య భారీగా గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆగ్రామంలో లవ్లీ మాథన్ అనే యువతి కనిపించకుండా పోతుంది. యువతి మిస్సింగ్ కేసును ఆనంద్ నారాయణ్ తన టీమ్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేపడుతాడు. కానీ అనుకోకుండా ఎస్ఐని ఆ కేసు నుంచి తప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? మిస్ అయిన యువతి దొరికిందా? అనేద సినిమా కథ.

అన్వెషిప్పిన్ కండేథుమ్ (Anweshippin Kandethum) సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 6 కోట్ల షేర్, 12 కోట్ల గ్రాస్ వసూళ్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో కేరళలో 250 స్క్రీన్లు, ఇండియా వైడ్ 150 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లు కలిపి మొత్తంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
అన్వెషిప్పిన్ కండేథుమ్ (Anweshippin Kandethum) తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం కేరళ, ఇతర ప్రాంతాల్లో 1.2 కోట్ల నికర కలెక్షన్లు, ఇండియాలో 2 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 2.7 కోట్లు నికరంగా 3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అన్వెషిప్పిన్ కండేథుమ్ (Anweshippin Kandethum) తొలి రోజు కంటే రెండో రోజు భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా కేరళ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 1.55 కోట్లు నికర వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల నికర వసూళ్లను 3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3 కోట్ల గ్రాస్, రెండో రోజు 3.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 6.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా రానున్న రోజుల్లో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే బ్రేక్ ఈవెన్ కూడా సులభంగా దాటే ఛాన్స్ కనిపిస్తున్నది.
అన్వేషిఫ్పిన్ కండేథుమ్ చిత్రం 3వ రోజు కూడా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం కేరళలో అత్యధికంగా వసూళ్లను ా సాధించింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. ఈ సినిమా మలయాళంలో 1.70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 4.5 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











