Bheemla Nayak: ఏపీ పాలిటిక్స్.. అలా జరిగితే పవన్ సినిమా ఎన్ని కోట్లు నష్టపోతుందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఆయనపై కావాలని విమర్శలు చేస్తున్నారు అని ఎన్నోసార్లు రుజువైంది. రాజకీయ లబ్ది కోసం మొన్నటి వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ఊహించనివిధంగా విమర్శలు చేయడం విశేషం. అయితే అటు తిరిగి తిరిగి చివరికి సినిమా పరంగా కూడా పవన్ కళ్యాణ్ పై ప్రభావం పడేలా ఫోకస్ చేస్తున్నారు అని విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తంగా భీమ్లా నాయక్ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపించే విధంగా ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయని కొందరు రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు ఏపీలో కొనసాగితే సినిమాకు స్థాయిలో నష్టాలు వస్తాయి? అనే వివరాల్లోకి వెళితే..

అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్యలో..
రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో భారీ బడ్జెట్తో నిర్మించారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య లో జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. ఇక మొదటి నుంచి చివరి వరకూ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అని ట్రైలర్స్ తోనే చాలా ఈజీ గా అర్థమైంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తప్పకుండా ఈ సినిమా ఈజీగా వంద కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా సినిమా రికార్డు స్థాయిలో అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్.

ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా భీమ్లా నాయక్ విడుదలవుతోంది అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అలర్ట్ అయింది. ఇంతకు ముందుకు సంక్రాంతికి కొన్ని సినిమాలు విడుదలయ్యాయి అంతకుముందు కూడా మరికొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం అప్పుడు ఎంతగా ఫోకస్ చేసింది లేదు. కానీ ఈ సారి చాలా వరకు ఏపీ పోలీసులు థియేటర్స్ పై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ నాయకుల సెటైర్లు
ముందుగానే టికెట్ల రేట్లు పెంచకుండా.. కలెక్టర్ రేంజ్ నుంచి ఆదేశాలు వెలువడుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా భీమ్లా నాయక్ టికెట్ల రేట్లు పెరగకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాల కంటే కూడా భీమ్లా సినిమా టికెట్ల రేట్లు పెరగకుండా చాలా బాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని, మిగతా విషయాలపై కూడా ఇదే రేంజ్ లో చర్చలు తీసుకుంటే ఎంత బావుంటుందో అని కొంత మంది రాజకీయ నాయకులు పరోక్షంగా సెటైర్లు కూడా చేస్తున్నారు.

ఇలాంటి టికెట్లు రేట్లతో..
ప్రస్తుతం కొనసాగుతున్న టికెట్ల రేట్లు అయితే సినిమాలకు ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవి కాదు అని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కనీసం సినిమా థియేటర్స్ కరెంటు బిల్లులు కూడా సరిపోయే విధంగా టిక్కెట్ల రేట్లు ఉండకపోవడం సరైంది కాదు అంటున్నారు. పది రూపాయల టికెట్లు 25 రూపాయల టిక్కెట్లు కొనసాగితే మల్టీప్లెక్స్ థియేటర్స్ మూసుకోవడం బెటర్ అని కూడా అంటున్నారు.

తెలంగాణలో టార్గెట్ ఈజీగానే..
ఇక బీమ్లా నాయక్ సినిమా ఆంధ్రప్రదేశ్లో అయితే 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అయితే ఈ సినిమాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ముందుగానే బెనిఫిట్ షోలు అలాగే రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునే విధంగా ఆఫర్స్ ఇచ్చారు. ఇక నైజాం లో 35 కోట్ల టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.
Recommended Video

20కోట్ల వరకు నష్టాలు తప్పవా?
అని ఆంధ్రప్రదేశ్లోనే 50 కోట్ల టార్గెట్ ను అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అని కొంత మంది సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్ల కారణంగా దాదాపు 20 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఫైనల్ గా భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద టోటల్ గా ఏ స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











