Aparichitudu Collections దుమ్మురేపుతున్న విక్రమ్ మూవీ హౌస్‌పుల్ కలెక్షన్లు.. అపరిచితుడుకు ఎన్ని కోట్లంటే?
విలక్షణ నటుడు విక్రమ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.ఈ చిత్రం ఏళ్ల క్రితం రికార్డు వసూళ్లను దక్షిణాదిలో వసూలు చేసింది. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాదిలో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అపరిచితుడు చిత్రం విక్రమ్ హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్‌కు అలాగే యూత్‌కు కిక్కు ఎక్కించే పాటలతో దక్షిణాదిలో బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్నది. ఇప్పటికీ రెమో పాత్రను పేరడిగా పలు చిత్రాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రభావాన్ని శంకర్ సినిమాపై వదిలారు. ఇక ఈ చిత్రం కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలై సంచలనం రేపుతున్నది.
అపరిచితుడు సినిమా మొత్తంగా తొలి రోజు 458 షోలు ప్రదర్శించారు. అయితే వాటిలో అన్ని షోలకు మంచి రెస్పాన్ప్ వచ్చింది. కానీ 76 షోలు హౌస్‌పుల్స్‌గా మారడం విశేషంగా నిలిచింది. దాంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అపరిచితుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతీచోట హౌస్ పుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీ మొదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు భారీగా థియేటర్లకు తరలి రావడంతోపాటు అభిమానులు స్క్రీన్ల ముందు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ రచ్చ రచ్చగా మార్చారు.
ఇక అపరిచితుడు సినిమా తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 50 లక్షల రూపాయల నెట్.. ఒక కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా ఇదే రేంజ్‌లో వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!

ఇక కన్నడలో అపరిచితుడు సినిమాకు మంచి స్పందన లభించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ మూవీ కన్నడలో 50 లక్షల రూపాయలు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇదే ఊపు కొనసాగితే.. శని, ఆదివారాల్లో కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











