Appudo Ippudo Eppudo Collections: నిఖిల్ మూవీ కలెక్షన్లు.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎన్ని కోట్లంటే?

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్, యువ హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ రూపొందించిన ఈ సినిమాకు నరసింహ చారీ చెన్నోజు, నరసబాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు ఎస్‌వీసీసీ, హైవే పిక్చర్స్ లిమిటెడ్, ఎల్ఎల్‌వీ రూపొందించారు. నవంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిగా లండన్‌లో అందమైన లొకేషన్లలో రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో అజయ్, జాన్ విజయ్, సత్య, సుదర్శన్, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి భారీగా ఖర్చు అయింది. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Appudo Ippudo Eppudo Collections

అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడం, బజ్ లేకపోవడంతో బిజినెస్ కూడా పెద్దగా జరిగినట్టు ట్రాక్ రికార్డు లేదు. ఈ సినిమాను సుమారుగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు భారీగానే బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల రూపాయల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

కార్తీకేయ 2 తర్వాత నిఖిల్ నటించిన ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ ఎలాంటి క్రేజ్ కనిపించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం కనిపించలేదు. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా 10 నుంచి 20 శాతం మధ్య ఆక్యుపెన్సీ నమోదైంది. అత్యధికంగా వైజాగ్‌లో ఆక్యుపెన్సీ కనిపించింది.

ఇక ఈ మూవీ ఏపీ, తెలంగాణలో చాలా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు రాబడుతున్నట్టు సమాచారం. వారాంతం సెలవు దినాల్లో ఏమైనా కలెక్షన్లు పెరిగితే బెటర్‌గా ఉంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X