twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రియల్ 3 న మళ్లీ భయపెడతాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: రవిబాబు గతంలో రూపొందించిన హిట్ చిత్రం ‘అవును' చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అవును-2' అనే పేరును నిర్ణయించి ఆ మధ్యన ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ పొస్టర్ ని విడుదల చేసారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్షవర్థన్ రానె, పూర్ణ జంటగా రూపొందింది. ఈ చిత్రం ఏప్రియల్ 3 వ తేదీన విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. రవిబాబు గత చిత్రం లడ్డూ బాబు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఈ చిత్రం తో ఎలాగయినా తిరిగి ఫామ్ లోకి రావాలని కృత నిశ్చయింతో ఉన్నాడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రవిబాబు మాట్లాడుతూ ‘‘అవును సినిమా ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే అవును-2 మొదలవుతుంది. ఆ సినిమాలోని పాత్రలతోనే ఈ సినిమా సాగుతుంది. మరో రెండు, మూడు కొత్త పాత్రలు కూడా యాడ్‌ అవుతాయి. ఈ సినిమాలో సెల్‌కాన్‌ ట్యాబ్‌ కీలక పాత్ర పోషించింది. నిఖిత పాత్ర కూడా ముఖ్యమైనదే. తొలి భాగంలో కనిపించని కెప్టెన్‌ రాజు గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం'' అని అన్నారు.

    April 3 fixed for ‘Avunu 2’ release

    డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘అవును-2 సినిమాను రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌ 1 కంటే 2 ఇంకా బావుంటుంది. హారర్‌ సినిమాలను ఎంజాయ్‌ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

    నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే: సత్యానంద్‌, కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, ఆర్ట్‌: భూపే్‌శ ఆర్‌.భూపతి, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.

    English summary
    ‘Avunu 2’ a horror movie directed by Ravi Babu. Produced by Ravi and SureshBabu, the film is now finding a decent date to hit screens. April 3rd is fixed as a release date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X