Aquaman 2 day 1 Collections ఆక్వామెన్ 2 తొలి రోజే 200 కోట్లు.. ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో విడుదలై రికార్డు కలెక్షన్లను రాబట్టిన ఆక్వామెన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం అక్వామెన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్. హాలీవుడ్‌లో పాపులర్ యాక్టర్స్ నికోల్ కిడ్మన్, అంబర్ హర్డ్, ప్యాట్రిక్ విల్సన్, అబ్దుల్ మాటీన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. జేమ్స్ వాన్ దర్శకత్వం వహించగా... డేవిడ్ లెస్లీ జాన్సన్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అక్వామెన్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ ఇండియాలోను, ఇతర దేశాల్లోను ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. అమెరికాలో ఈ సినిమా డిసెంబర్ 22 తేదీన విడుదల అవుతున్నది. ఈ క్రమంలో చైనా, ఇతర దేశాల్లో భారీగా ఆక్యుపెన్సీ, అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది.

Aquaman 2 day 1 Estimated Collections worldwide: Nicole Kidmans mvoie poor performance at Indian box office

అక్వామెన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించింది. 2018లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1.5 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికా అంటే యూఎస్ఏ, కెనడాలోనే 335 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో అక్వామెన్ కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అక్వామెన్ 2 సినిమాను ఇండియాలో పలు భాషల్లో రిలీజ్ చేశారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేశారు. అంతేకాకుండా 3D, ఐమాక్స్ వెర్షన్ కూడా విడుదల చేశారు. అయితే ఇండియాలో అన్ని భాషల్లోను పెద్దగా ఈ మూవీ ప్రభావం చూపలేకపోయింది.

Aquaman 2 day 1 Estimated Collections worldwide: Nicole Kidmans mvoie poor performance at Indian box office

అక్వామెన్ 2 చిత్రం ఏ భాషలోను భారీగా కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ సినిమాకు సుమారుగా 30 శాతానికి మించి అక్యుపెన్సీ కనిపించలేదు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై. హైదరాబాద్, పూణె లాంటి నగరాల్లో అంతంతా మాత్రమే రెస్సాన్స్ కనిపించింది. డంకీ సినిమా ప్రభావం ఈ మూవీపై పడటం వల్ల ఎక్కువగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అక్వామెన్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో అన్ని భాషల్లో, అన్ని వెర్షన్లలో కలిపి మొదటి రోజు 2 కోట్లకుపైగా షేర్, 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించవచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 నుంచి 30 మిలియన్ డాలర్లు అంటే 200 నుంచి 230 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X